విద్యార్థుల కోసం పియర్సన్ టాబ్లెట్‌లు

ప్రముఖ అంతర్జాతీయ లెర్నింగ్ కంపెనీ పియర్సన్ (Pearson),భారతీయ పాఠశాలల్లో టాబ్లెట్ ఆధారిత విద్యను అందించే క్రమంలో ఎంఎక్స్ టచ్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రకటించింది. ఎమ్ఎక్స్ టచ్ ప్లాట్‌ఫామ్ ప్రభావితమైన డిజిటల్ లెర్నింగ్‌ను విద్యార్ధులకు చేరువ చేస్తుంది. 3డి యానిమేషన్స్, ప్రశ్నల పరీక్ష ఇంకా వీడియోలను ఈ పీసీ ద్వారా నిర్వహించుకోవచ్చు.
మూడు వేరియంట్‌లలో ఎమ్ఎక్స్ టచ్ టాబ్లెట్‌లు లభ్యం కానున్నాయి. వాటి వివరాలు........
ఎంఎక్స్ టచ్ - యాక్టివ్ టచ్:
ఈ టాబ్లెట్ నాలుగు సబ్జెక్టులను ఆఫర్ చేస్తోంది. ఇంగ్లీష్, సైన్స్, గణితశాస్త్రం ఇంకా హిందీ. 3 నుంచి 8వ తరగతి విద్యార్ధుల వరకు ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. యానిమేషన్స్, వీడియోస్, బీబీసీ మోషన్ గ్యాలరీ వంటి ప్రధాన ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
ఎంఎక్స్ టచ్ - డిజిటల్లీ:
ఈ అవార్డు విన్నింగ్ టీచింగ్ టూల్ యానిమేషన్స్, వీడియోస్, స్వీమ వివరణాత్మక డయాగ్రామ్స్, వర్క్ షీట్స్, ప్రశ్నల పరీక్ష (క్విజ్) ఇంకా ఇతర పరిశోధనలకు ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ పీసీ సౌలభ్యతతో ఇంటి నుంచి సైతం పాఠాలను నేర్చుకోవచ్చు.
ఎంఎక్స్ టచ్- అల్టీమేట్:
ఈ వర్షన్ టాబ్లెట్‌లో పై రెండు వేరియంట్‌ల ఫీచర్లు ఒదిగి ఉన్నాయి.
ధర ఇతర వివరాలు:
ఈ పీసీలు 7 ఇంకా 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. 7 అంగుళాల వేరియంట్ ధర రూ.7,000. 10 అంగుళాల వేరియంట్ ధర రూ.12,000.


Click it and Unblock the Notifications








