టార్గెట్ గ్రామీణం!

By Prashanth
|
Penta T-Pad


ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ సహకారంతో పాంటెల్ టెక్నాలజీస్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన 8 అంగుళాల 3జీ టాబ్లెట్ ‘టీ-ప్యాడ్ WS802C’ పై మార్కెట్లో వాడి వేడి చర్చ సాగుతోంది . ఈ పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ 60రోజుల వాలిడిటీతో కూడిన 2జీబి, 3జీ డేటా ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. గ్యాడ్జెట్ ధర రూ.15,000. గ్రామీణ ప్రజలే లక్ష్యంగా మార్కెట్లో విడుదలైన పెంటా టీ-ప్యాడ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం.

పీసీలోని బెస్ట్ ఫీచర్లు:

- 8 అంగుళాల సమర్థవంతమైన టచ్ స్ర్కీన్, రిసల్యూషన్854× 600పిక్సల్స్,

- 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- మల్లీ ఫార్మాట్ వీడియో వ్యవస్థ,

- బ్లూటూత్ వీ2.1, 3జీ, వై-ఫై 802.11 b/g/n, వై-పై హాట్ స్పాట్, యూఎస్బీ కనెక్టువిటీ, హెడ్ సెట్ జాక్ 3.5ఎమ్ఎమ్,

- యాక్సిలరోమీటర్ సెన్సార్,

- 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, 4జీబి ఆన్ బోర్డ్ స్టోరేజ్.

నిరాశ కలిగించే అంశాలు:

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- రేర్ కెమరా 2 మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా 0.3 మెగా పిక్సల్,

- 512ఎంబీ డీడీఆర్3 ర్యామ్,

- జీపీఎస్ నావిగేషన్,

- 4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

పోటీ మార్కెట్..?

టాబ్లెట్ మార్కెట్లో తమదైన హవాను కొనసాగిస్తున్న జింక్ జడ్999 ప్లస్, మైక్రోమ్యాక్స్ ఫన్ బుక్ ప్రోల నుంచి పెంటా టీ-ప్యాడ్ గట్టిపోటీని ఎదుర్కొవల్సి ఉంది. ఈ టాబ్లెట్ విక్రయాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఆశాజనకమైన అమ్మకాలు రాబట్టే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X