ప్లాన్ హిట్టయితే..జాతకాలే ఛేంజ్?

By Prashanth
|
Philips


ఆడియో పరికరాల తయారీ విభాగంలో విశ్వసనీయతను మూటగట్టుకున్న అంతర్జాతీయ బ్రాండ్ ఫిలిప్స్ తాజాగా టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ పై దృష్టి సారించింది. 7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో టాబ్లెట్ కంప్యూటర్లను ఈ సంస్థ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజులు రన్ కానున్నాయి.

 

టాబ్లెట్ కీలక ఫీచర్లు:

MIPS ఆధారిత CPU ఆర్కిటెక్చర్,

 

వివిధ మీడియా ఫార్మాట్‌లను సపోర్ట్ చేసే తత్వం,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

బ్యాటరీ బ్యాకప్ 4 నుంచి 5 గంటల వరకు,

డిస్‌ప్లే సైజ్ 7 అంగుళాలు.

స్ర్కీన్ రిసల్యూషన్ (1024 × 600, 800 × 480).

రెండు భిన్నమైన స్ర్కీన్ రిసల్యూషన్ వేరియంట్‌లలో ఈ టాబ్లెట్ లభ్యం కానుంది. ఐసీఎస్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగా నడిచే ఈ పీసీలు వివిధ మీడియా ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తాయి. బ్యాటరీ బ్యాకప్ వాడకాన్ని బట్గి 4 నుంచి 5 గంటల వరకు వస్తుంది. టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన MIPS ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. డివైజ్ ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తొలత ఈ టాబ్లెట్ కంప్యూటర్‌ను చైనాలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్ల జాబితాలో ఫిలిప్స్ రూపొందిస్తున్న వాటిని కూడా చేర్చవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X