కంప్యూటెక్స్ 2014లో ఫిలిప్స్ టూ-ఇన్-వన్ మానిటర్
ఆసియాలోనే అతిపెద్ద టెక్ షో కంప్యూటెక్స్ 2014 తైవాన్ రాజధాని తైపీ వేదికగా మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు కన్నుల పండుగగా సాగిన ఈ ప్రదర్శనలో దాదాపు 1500 కంపెనీలు పాల్గొన్నట్లు అంచనా.

ఈ ట్రేడ్ షోను వేదికగా చేసుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ ఫిలిప్స్ టూ ఇన్ వన్ మానిటర్ 10డీ66క్యూజేఎన్ఎస్ (19DP6QJNS)ను ప్రదర్శించింది. ఈ టూ ఇన్ వన్ స్ర్కీన్ మానిటర్‌లో భాగంగా 2, 19 అంగుళాల స్ర్కీన్‌లను ఫిలిప్స్ ఏర్పాటు చేసింది. మొత్తంగా యూజర్ 38 అంగుళాల తెర పై తమ కార్యకలాపాలను నిర్వహించుకోగలుగుతాడు.
ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఐపీఎస్ డిస్‌ప్లే అత్యత్తమ వీక్షణా అనుభూతులను యూజర్‌కు చేరువచేస్తుంది. మల్టీ కనెక్టువీటీ ఆప్షన్‌లను ఈ టూ ఇన్ వన్ మానిటర్ కలిగి ఉంటుంది. ప్రత్యేకించి 3జీ గ్రాఫిక్ డిజైనింగ్ పై పనిచేసే వారికి ఈ మానిటర్ మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఫిలిప్స్ టూ ఇన్ వన్ మానిటర్ ఈ ఏడాదిలోనే మార్కెట్లో విడుదలయ్యే అవకాశముంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications