'సొంతమైతే.. మీరో సరికొత్త'...!!!

Posted By: Staff

'సొంతమైతే.. మీరో సరికొత్త'...!!!

‘‘సొంతమైతే, మీరో సరికొత్త" ట్యాగ్‌లైన్ అదిరింది కదండి..!! ఇష్టంతోనో.. లేక నమ్మకంతోనో ఓ విదేశీ బ్రాండ్ తన ‘product’కి ఈ ట్యాగ్‌లైన్ తగిలించుకుంది. ట్యాగ్‌లైనే ఇంత అదరగొడితే, మరా product ఎలా అదరగొడుతుందోనని తెలుసుకోవాలని ఉంది కదూ..!! అయితే నాతో రండి.. మీకు ‘Pierre Cardin’ బ్రాండ్ తెలుసా.. ఐరోపా ఖండంలో జన్మించిన ఈ బ్రాండ్ ‘techno product’లను అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఇమిడి ఉన్న వస్తువును ఉత్పత్తి చేయటంలో దిట్ట.. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన ఈ ‘fire brand’ కాలానుగుణంగా వినియోగదారులకు కొత్తదనాన్ని రుచిచూపిస్తుంటుంది.

‘tablet pc’లు మార్కెట్లో కొత్త ఒరవడిని సంతరించుకుంటున్ననేపధ్యంలో Pierre Cardin సంస్థ ‘Pierre Cardin PC-7006’ పేరుతో ఓ సొగసరి 7 inch టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘touch screen’ స్వభావం కలిగిన ఈ stylish device రిసల్యూషన్ సామర్ధ్యం 800 x 480 కలిగి ఉంటుంది.

అధునాతన ‘android’ ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ‘PC-7006’, Samsung S5PV210 Cortex-A8 single core processor కలిగి 1GHz వేగంతో పనిచేస్తుంది. ఇక ఈ ‘tablet pc’లో పొందుపరిచిన ఇతర featureలను పరిశీలిస్తే Wi-Fi, 3G వంటి అంశాలు వేగవంతంగా పనిచేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ పీసీలో అదనంగా పొందుపరిచిన 3G USB modem మరువలేని 3G అనుభూతిని మీకు అందిస్తుంది. ఇక మెమరీ విషయానికి వస్తే ‘expandable’ పద్దతిలో డేటాను 16GB వరకు దాచుకోవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడని ‘Pierre Cardin PC-7006’ అధునాతన పరిజ్ఞానంతో కూడి ఉన్న music, video playerలను ఈ టాబ్లెట్‌లో పొందుపరిచింది. టాబ్లెట్‌కు అమర్చిన Camera నాణ్యమైన ఫోటోలు తీసుకునేందుకు ఉపకరిస్తుంది, అంతేకాదు వీడియోను కూడా రికార్డు చేసుకోవచ్చు. ఇక Connectivity విషయానికి వస్తే పొందుపరిచిన Bluetooth, power management వంటి అంశాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తాయి.

‘Pierre Cardin PC-7006’ని ఆకర్షణీయంగా రూపొందించే క్రమంలో ఏ విషయంలోనూ రాజీపడని కంపెనీ వర్గాలు శ్రమించి టాబ్లెట్‌కు అత్యుత్తమ రూపు రేఖను తెచ్చాయి. టాబ్లెట్‌తో పాటు అదనంగా వచ్చే ‘leather pouch’ ఆకట్టకునే నలుపురంగుతో చూసేవాళ్ల మదిని కొల్లగొడుతుంది. అంతేకాకుండా ఈ టాబ్లెట్‌కు ఈ పౌచ్ రక్షణకవచంలా నిలుస్తుంది. ‘Pierre Cardin PC-7006’ ఇండియన్ మార్కెట్లోకి 2011 చివరిలో రావచ్చు. ఇన్ని అత్యుత్తమ ఫీచర్లతో ఊరిస్తూ.. ఆశలు పెంచుతున్న ఈ టాబ్లెట్ ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot