Home
Computer

‘A10’ పాకెట్ టాబ్లెట్.. ప్రపంచం మీ జేబులో...!!

By Super
PocketBook A10

‘‘ప్రపంచాన్ని జేబులోకి తెచ్చే స్థాయికి సాంకేతిక వ్యవస్థ ఎదిగిపోయింది. అధునిక పరిజానంతో రూపుదిద్దుకుంటున్నసాంకేతిక పరికరాలు కోకొల్లలుగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలనే యూరోపియన్ సంస్థ ‘A10’ పాకెట్ టాబ్లెట్ పరికరాన్ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇండియన్ టాబ్లెట్ సెగ్మంట్లో ఈ బ్రాండ్ కు చెప్పుకోదగ్గ ఇమేజ్ లేనప్పటికి ఐరోపా దేశాల్లో వినియోగదారుల విశ్వాసాన్ని చోరగుంది’’

‘A10’ ఫీచర్లు క్లుప్తంగా:

- ఆండ్రాయిడ్ 2.3.4 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ఈ పాకెట్ బుక్ 10.1 అంగుళాల సైజు కలిగి ఉంటుంది.

- టచ్ సెన్సిటివ్ స్వభావం కలిగిన టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ ప్లే 1024 x 768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- పొందుపరిచిన 1GHz TI OMAP 3621 సింగిల్ కోర్ టెక్సాస్ ప్రొసెసింగ్ వ్యవస్థ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది.

- కెమెరా విషయంలో నిరుత్సాహపరిచిన ‘A10’, వేగవంతమైన 3జీ వ్యవస్థను కలిగి ఉంది.

- పొందుపరిచిన 802.11 b/g/n వై- ఫై సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరుస్తుంది.

- వేలి సాయంతో సులువుగా పాకెట్ బుక్ ను ఆపరేట్ చేయవచ్చు.

- సామాన్య మధ్య తరగతి ప్రజలకు మరింత ఉపయుక్తంగా నిలిచేందుకు త్వరలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పీసీ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12,000/.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X