బ్రేకింగ్ న్యూస్..అభిమానుల్లో మొదలైన ఉత్సాహం!!

Posted By: Super

బ్రేకింగ్ న్యూస్..అభిమానుల్లో మొదలైన ఉత్సాహం!!

పోలరాయిడ్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ బ్రాండ్ తాజాగా వెలువరించిన ప్రకటన సంబంధిత శ్రేణుల్లో ఉత్సాహాభరిత వాతవరణాన్ని నెలకొల్పంది. అత్యాధునిక 3డి డిస్‌ప్లేతో పోలరాయిడ్ రూపొందించిన 3డి టాబ్లెట్ కంప్యూటర్ విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. తొలత ఈ డివైజ్‌ను యూరోప్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్యాడ్జెట్ ప్రధాన విశిష్టతను పరిశీలిస్తే 3డి విజువల్స్‌ను కళ్లద్ధాల సాయం లేకుండా వీక్షించవచ్చు.

ఇతర ముఖ్య ఫీచర్లు:

-  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 10 అంగుళాల టచ్ స్ర్కీన్,(రిసల్యూషన్ 1024×768పిక్సల్స్)

- 512ఎంబీ ర్యామ్,

- 1.5 గిగాహెడ్జ్ ఆర్మ్ బేసిడ్ ప్రాసెసర్,

- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

- వై-ఫై కనెక్టువిటీ.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ అవుట్ సాయంతో హైడిఫిషన్ తెరలకు టాబ్లెట్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ రీడర్ సాయంతో టాబ్లెట్ ఎక్సటర్నల్  మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు. అత్యాధునిక హంగులతో మార్కెట్ గడపతొక్కనున్న పోలరాయిడ్‌కు ఆపిల్, శామ్‌సంగ్, అసస్ వంటి దిగ్గజాల నుంచి పోటీ ఎదురుకానుంది. అయితే విడుదలకు సంబంధించి ఖచ్చితమైన తేదీని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇప్పటికే యూరోపియన్ రిటైలర్లు ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించారు. పోలరాయిడ్ 3డి టాబ్లెట్ ధర అంచనా రూ.18,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot