ఆ మైనస్ పాయింట్‌ను క్యాష్ చేసుకునేందుకు..?

Posted By: Prashanth

ఆ మైనస్ పాయింట్‌ను క్యాష్ చేసుకునేందుకు..?

 

అపారమైన అనుభవంతో ప్రొఫెషనల్ కెమెరాలను డిజైన్ చేసే ‘పోలరోయిడ్’(Polaroid) సంస్థ పటిష్ట కెమెరా వ్యవస్థతో కూడిన ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌ను ప్రవేశపెట్టనుందని ఆన్‌లైన్ వర్గాలు ఉటంకించాయి. తాజాగా లభ్యమవుతున్న టాబ్లెట్ పీసీలలో కెమెరా వ్యవస్థ లోపోబయిష్టంగా ఉండటాన్ని కలిసొచ్చే అంశంగా భావించిన పోలరోయిడ్ పటిష్ట కెమెరా వ్యవస్థతో ఈ టాబ్లెట్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లాస్‌వేగాస్‌లో నిర్వహించనున్న ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ఈ డివైజ్‌ను ప్రదర్శించనున్నారు.

పటిష్టమైన ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ టాబ్లెట్ రన్ అవుతుంది. శక్తివంతమైన కెమెరా వ్యవస్థను డివైజ్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు నాణ్యమైన క్లారిటీతో పనిచేస్తాయి. ఈ గ్యాడ్జెట్ స్ర్కీన్ డిస్‌ప్లే 7 అంగుళాలు. తక్కువ బరువు కలిగి ఉండటంతో సౌకర్యవంతంగా కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.

నిరుత్సహాపరిచే అంశం:

ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్ ఈ డివైజ్‌లో లోపించింది. ఈ వెలితి అమ్మకాల పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot