ఉచిత కంప్యూటర్ హామి రాజకీయ పార్టీలకు ఓట్లు రాల్చిందా..?

Posted By: Staff

 ఉచిత కంప్యూటర్ హామి రాజకీయ పార్టీలకు ఓట్లు రాల్చిందా..?

 

గడచిన ఏడాది తమళనాడు... ఈ ఏడాది ఉత్తర్‌‌ప్రదేశ్ రాష్ట్ర్రాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు జయలలిత (అన్నా డిఎమ్‌కే), ములాయంసింగ్ యాదవ్ (సమాజ్ వాదీ) పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టాయి. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకట్టుకోవటంలో అటు జయ అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలాష్ యాదవ్‌లు పూర్తి స్థాయిలో సఫలీక్ళతమయ్యారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు  కంప్యూటర్లను ఉచితంగా అందిస్తామంటూ ఇరు పార్టీలు ఇచ్చిన హామిలు ఓటర్లను మరింతగా ప్రభావితం చేసాయి.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజావాదీ పార్టీ తాము అధికారంలోకి వస్తే మెట్రికులేషన్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్ అదేవిధంగా టాబ్లెట్ పీసీలను అందిస్తామని మాటిచ్చింది. ఈ వాగ్ధానం మేరకు ఏడాదికి సుమారు 45 లక్షల మందికి ఉచితంగా కంప్యూటర్లను ఎస్పీ అందించాల్సి ఉంది. గత ఏడాది తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. రాబోయే అయిదేళ్లలో విద్యార్థులకు 68 లక్షల లాప్‌టాప్‌లు ఇస్తానని చెప్పింది. ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల్లో చేసిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే 10,200 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది లక్షల లాప్‌టాప్‌ కంప్యూటర్లకు ఆర్డరిచ్చింది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలో సరఫరా చేయాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting