పెన్‌‌డ్ర్రైవ్ కన్నా పటిష్టమైనది!!

Posted By: Prashanth

పెన్‌‌డ్ర్రైవ్ కన్నా పటిష్టమైనది!!

 

పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌లను రూపొందించటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ రాక్‌స్టార్ (rocstar)ఓ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. డేటాను మరింత భద్రతతో పదిలపరిచే పోర్టబుల్ హార్డ్‌డ్రైవ్‌ను సంస్ధ డిజైన్ చేసింది. జనవరిలో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక పై ఈ హార్డ్‌డ్రైవ్‌ను ఆవిష్కరించారు. సాధారణంగా మనం ముఖ్యమైన డేటాను పెన్‌డ్రైవ్, సీడీ లేదా డీవీడిల్లో భద్రపరుస్తుంటాం. మనం నిక్షిప్తం చేసిన డేటాకు ఈ డివైజ్‌లు పూర్తి స్థాయి రక్షణను కల్పించలేవు. ఈ సమస్యను అధిగమిస్తూ రాక్‌స్టార్ సంస్థ మిలటరీ సెక్యూరిటీ వ్యవస్థతో కూడిన పోర్టబుల్ హార్డ్‌డ్రైవ్‌ను వ్ళద్ధి చేసింది. క్లిష్టమైన ఎన్‌క్రిప్ఫిన్ కోడ్‌తో కూడిన రక్షణ వలయాన్ని ఈ డివైజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సురక్షిత వ్యవస్థ మీ డేటాకు పూర్తి స్థాయి భరోసాను కల్పిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting