ప్రపంచ వ్యాప్తంగా ‘అసస్’ దూకుడు..!!

Posted By: Super

ప్రపంచ వ్యాప్తంగా ‘అసస్’ దూకుడు..!!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అమ్మకాలతో 'అసస్ బ్రాండ్" తనేంటో నిరూపించుకుంది. మంచి దూకుడు మీదున్న ఈ బ్రాండ్ 'సరికొత్త స్లైడర్ టాబ్లెట్"ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 'అసస్ ఈ ప్యాడ్ స్లైడర్" (new Asus Eee Pad Slider) పేరుతో విడుదల కాబోతున్నఈ మోడల్ 'అసస్" అమ్మకాల స్థాయిని మరింత పెంచుతుందని అంచనాలు ఊపందుకున్నాయి. స్లైడర్ కీ బోర్డుతో రూపుదిద్దకుంటున్న ఈ టాబ్లెట్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. నోట్ బుక్ వినియోగదారులకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

'అసస్" సరికొత్త స్లైడర్ టాబ్లెట్ 10.1 అంగుళాల ఎల్ సీడి డిస్ ప్లే సామర్థ్యం కలిగి 800 X 1280 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. రూపొందించిన స్క్రీన్ లుక్ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆకట్టకుంటుంది. అయితే 'అసస్ ప్యాడ్"కు అనుసంధానం చేసుకునే ప్రక్రియలో బాగంగా అమర్చే కీ బోర్డు, మౌస్ వంటి అంశాలు టెక్స్ట్ డాక్యుమెంట్లను రూపొందించే క్రమంలో స్వల్ప ఆసౌకర్యానికి గురి చేస్తాయిట.

హనీకూంబ్ 3.0 ఆండ్రాయిడ్ వర్షెన్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ టాబ్లెట్ పని చేస్తుంది. అయితే ఈ వర్షన్‌ను త్వరలో v3.1కి అప్ గ్రేడ్ చేయునున్నారు. ఈ స్లైడర్‌లో పొందుపరిచిన న్విడియా టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రొసెస్సర్, 1 జీబీ ర్యామ్‌లు వేగవంతవైన పనితీరును మీకు అందిస్తాయి.

ఈ స్లైడర్‌లో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ కెమెరా నాణ్యమైన చిత్రాలను మీకు అందిస్తుంది. అంతేకాదు వీజీఏ వ్యవస్థ ద్వారా వీడియో ఛాటింగ్ చేసుకోవచ్చు. హెచ్‌డీ‌ఎమ్‌ఐ, వై - ఫై, బ్లూటూత్ వంటి ఇతర అంశాలు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయి. మెమరీని 16 నుంచి 32 జీబీకి పెంచుకోవచ్చు. అయితే ఈ సరికొత్త 'అసస్ స్లైడర్"కు సంబంధించి ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి తేది ఖరారు కాలేదు. అయితే మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.35000 ఉండోచ్చని వ్యాపర వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot