అక్టోబర్ లో అదరగొడతానంటున్న ‘హెచ్ పీ పామ్ టచ్ ప్యాడ్’..!!

Posted By: Super

అక్టోబర్ లో అదరగొడతానంటున్న ‘హెచ్ పీ పామ్ టచ్ ప్యాడ్’..!!

ఈ అక్టోబర్‌లో విడుదల కాబోతున్న సరికొత్త ' హెచ్‌పీ పామ్ టచ్‌ప్యాడ్ ఓపల్" ( HP Palm Touchpad Opal) పై అంచనాలు షికార్లు చేస్తున్నాయి. హెచ్ పీ వెబ్ 3.0 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుంకుంటున్న ఈ టచ్‌ప్యాడ్‌లో 'లైనెక్స్" వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట.

ఇక ఈ ప్యాడ్‌లో పొందుపరిచిన మైక్రో ప్రాసెసర్ చిప్ సెట్ల విషయానికి వస్తే సంయుక్తంగా పొందుపరిచిన 1500 MHzతో కూడిన 'క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్", 'ఏపీక్యూ 8060" వ్యవస్థలు డివైజు‌ను సమర్థవంతంగా నడిపిస్తాయి. ఇక ర్యామ్ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే 1024 MB కలిగిన 'ఫ్లాష్ ఈప్రామ్" ప్యాడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఐపీఎస్ కలర్ టెక్నాలజీతో కూడిన 'టీఎఫ్టీ" డిస్‌ప్లే‌ను ఇందులో పొందుపరిచారు. 178 మిల్లిమీటర్ల విస్తీర్ణం కలిగిన డిస్‌ప్లే స్ర్కీన్, 'క్వాల్‌కమ్ ఆడిర్నో గ్రాఫిక్ కంట్రోలర్" కలిగి న్యాణ్యామైన చిత్రాలను మీకు అందిస్తుంది. ఇక హార్డ్‌వేర్ అంశాలను పరిశీలిస్తే అనుసంధానించిన ఆడియో సబ్ వ్యవస్థలు వినసొంపైన ఆడియోను మీకు అందిస్తాయి. సెల్యూలర్ డేటా లింక్లైన 'జీపీఆర్‌ఎస్", 'ఎడ్జ్ టెక్నాలజీ", 'యూఎమ్‌టీఎస్", 'హెచ్‌సుపా" వంటి అంశాలు ఉపకరిస్తాయి.

హెచ్‌పీ ‌టచ్‌ప్యాడ్‌లో పొందుపరిరచిన ఇంటర్నల్ యాంటీనా వీక్ సిగ్నల్స్‌ను సైతం స్వీకరిస్తుంది. 2.0 హై స్పీడ్ డేటా ట్రాన్సఫర్ సామర్ధ్యం కలిగిన 'పామ్ టచ్ ప్యాడ్"కి మైక్రో -బి యూఎస్‌బీ సిరీస్ కనెక్టర్‌ను అనుసంధానించారు. అదనపు అంశాలైన బ్లూటూత్ 2.1, వై -ఫై, IEEE 802.11 వ్యవస్థలు వేగవంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను నడిపిస్తాయి.

స్మార్ట్ ఫోన్లలో లభ్యమయ్యే అన్ని సాదారణ ఫీచర్లు 'హెచ్‌పీ పామ్ టచ్‌ప్యాడ్"లో లభ్యమవుతాయి. ఇందలో పొందుపరిచిన బ్యాటరీ వ్యవస్థ అత్యాధినిక మన్నికతో వినియోగదారునుకి సహకరిస్తుంది. తెలసిన సమాచారం మేరకు హెచ్‌పీ టచ్ ప్యాడ్‌లో మెమరీ విస్తరణ, ప్రమైరీ కీ బోర్డు, యనలాగ్ రీసీవర్, డిజిటల్ మీడియా బ్రోడ్ వంటి అంశాలు కొరవడినట్లు తెలుస్తోంది.

అయితే టచ్‌ప్యాడ్‌లో పొందుపిరిచిన ఫీచర్లు వినియోగదారులకు ఫ్రెండ్లీ‌గా సహకరిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ అంచనాలతో అక్టోబర్‌లో విడుదల కాబోతున్న 'హెచ్ పీ పామ్ టచ్‌ప్యాడ్ ఓపెల్" మార్కెట్లో ఏ స్థాయిని ఆక్రమిస్తుందో వేచి చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot