కొత్త సరుకు.. పిచ్చ డిమాండ్!

Posted By: Staff

కొత్త సరుకు.. పిచ్చ డిమాండ్!

 

కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 ఆవిర్భావంతో, మార్కెట్లో ఏర్పడే డిమాండ్ ను దృష్టిలోఉంచుకని గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు విండోస్ 8 ఆధారిత కంప్యూటింగ్ పరికరాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రముఖ బ్రాండ్‌లైన అసస్, ఏసర్‌లు విండోస్ 8 పరికరాలను ఈ వారం ప్రవేశపెట్టునున్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఎమ్ఎస్ఐ ‘స్లైడర్ ఎస్20’ విండోస్ 8 టాబ్లెట్‌ను వృద్ధి చేస్తుంది. విండోస్ 8 ఆఫరేటింగ్ సిస్టం, మల్టీపుల్ ప్రాసెసర్, రోబస్ట్ డిజైన్ వంటివి ఈ గ్యాడ్జెట్ ప్రధానంశాలు. టాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే 11.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్, రిసల్యూషన్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది . స్లైడింగ్ కీబోర్డ్ సౌలభ్యతతో టాబ్లెట్‌ను ల్యాప్‌టాప్‌లా మార్చుకోవచ్చు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ డివైజ్‌లో లో- వోల్లేజ్ ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్‌తో పాటు 4 జీబి ర్యామ్‌లను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ వంటి కనెక్టువిటీ అంశాలు డివైజ్ పటిష్టతను మరింత పెంపొందిస్తాయి. రెండు వేరియంట్ లలో స్లైడర్ ఎస్20 లభ్యంకానుంది. దీనిలో హైఎండ్ వేరియంట్ ధర అంచనా రూ.56,000. లో-ఎండ్ మోడల్ ధర తెలియాల్సి ఉంది.

ఈ ల్యాప్‌టాప్ ఖరీదు లక్ష..?

కంప్యూటర్ల నిర్మాణ సంస్థ ఎమ్ఎస్ఐ MSI ఓ సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. స్టీల్ సిరీస్ నుంచి జీటీ70 మోడల్‌ రూపుదిద్దుకున్న ఈ శక్తవంతమైన గేమింగ్ డివైజ్ 17 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

కీలక ఫీచర్లు:

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ క్వాడ్‌కోర్ ఐ7 ప్రాసెసర్, 32జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 670ఎమ్ జీడీడీఆర్5 గ్రాఫిక్ కార్డ్, 750జీబి 7200ఆర్ పీఎమ్ హార్డ్‌డ్రైవ్, హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 3డి స్టీరియో సౌండ్ సిస్టం, హైడెఫినిషన్ Dynaudio స్పీకర్స్, 64జీబి ఎస్ఎస్‌డి రెయిడ్, 7 ఇన్ 1 కార్డ్ రీడర్, బిగ్‌ఫూట్ కిల్లర్ గేమింగ్ నెట్‌వర్క్, బ్లూరే బర్నర్, గిగాబిట్ ఇతర్‌నెట్ ల్యాన్, 6ఎంబీ క్యాచీ మెమెరీ, 9సెల్ బ్యాటరీ ప్యాక్, 204 పిన్ SODIMM సాకెట్స్, 720 పిక్సల్ సామర్ద్యం గల హై‌డెఫినిషన్ వెబ్‌క్యామ్, ఏఎమ్‌పి హెడ్‌సెట్, ఇంటెల్ హెచ్ఎమ్77 చిప్‌సెట్, ఎమ్ఎస్ఐ సినిమా ప్రో టెక్నాలజీ, సౌండ్ బ్లాస్టర్ కంపాటబుల్, S/PDIF డిజిటల్ అవుట్ పుట్, బ్లూటూత్ కనెక్టువిటీ,

డాల్బీ డిజిటల్ లైవ్, 3జీబి డీడీఆర్5 వీడియో మెమెరీ.

అత్యాధునిక ఫీచర్లతో సమర్థవంతంగా డిజైన్ కాబడిన ఈ గేమింగ్ ల్యాపీ అనుక్షణం వాస్తవమైన అనుభూతులకు లోను చేస్తుంది. ఏర్పాటు చేసిస సౌండ్ స్టీరియో వ్యవస్థ కొత్త లోకాలను మీకు పరిచయం చేస్తుంది. నిక్షిప్తం చేసిన ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్ ల్యాపీ పనితీరును వేగవంతం చేస్తుంది. క్వాడ్‌కోర్ మూడవ జనరేషన్ సీపీయూ, 3జీబి జీడీడీఆర్5 గ్రాఫిక్ వ్యవస్థలు ఉత్తమమైన పనితీరును ప్రదర్శిస్తాయి. కమ్యూనికేషన్ ఫీచర్లను పరిశీలిస్తే బిగ్‌ఫూట్ కిల్లర్ గేమింగ్ నెట్‌వర్క్, జాక్సన్ పీక్ 1×2(802.11 b/g/n), ఇన్‌బుల్ట్ గిగాబిట్ ఇతర్‌నెట్ ల్యాన్, బ్లూటూత్ వ్యవస్థలు యూజర్ అవసరాలపు సుష్టిగా తీరుస్తాయి. నిక్కార్సైన గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం ఎదరుచూస్తున్న వారికి ఎమ్ఎస్ఐ జీటీ70 ఉత్తమ ఎంపిక. ఇండియన్ మార్కెట్లో ఈ ల్యాపీ ధర అంచనా రూ.1,00,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot