TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బ్రౌజింగ్ హిస్టరీ గోప్యంగా ఉండాలంటే..?
ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాకు సంబంధించిన ‘హిస్టరీ' ఇంకా ‘కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే ‘ప్రైవేట్ బ్రౌజింగ్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేట్ బ్రౌజింగ్ చిట్కాను అనుసరించటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.
మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+alt+p షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.