ఎంఎస్ ఎక్సెల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Posted By:

కంప్యూటర్‌ను వినియోగించే వారిలో చాలామంది తమతమ అవసరాలను బట్టి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఫీచర్లను తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడే సమయంలో మెనూలోకి ప్రవేశించేందుకు ప్రతిసారీ మౌస్‌ను ఆశ్రయంచటం కంటే అందుబాటలో ఉన్న కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించటం ద్వారా పని మరింత వేగవంతంగా సాగుతుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎంఎస్ ఎక్సెల్‌కు సంబంధించి పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీముందుకు తీసుకువస్తున్నాం...

ఎంఎస్ ఎక్సెల్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

కీబోర్డ్ షార్ట్‌కట్ : ALT + =

ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ఎక్స్‌ఎల్ షీట్‌లోని గణాంకాలను స్వయంచాలకంగా లెక్క కట్టి ఫలితాన్ని సంబంధింత కాలమ్‌లో ప్రదర్శిస్తుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + `
ఫలితం : ఫార్ములాలను డిస్‌ప్లే చేస్తుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↑
ఫలితం : షీట్‌లోని ప్రారంభ సెల్‌కు తీసుకువెళుతుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↓
ఫలితం : షీట్‌లోని ముగింపు సెల్‌కు తీసుకువెళుతుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + -(మైనస్ కీ)
ఫలితం : ఈ కీబోర్డ్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరం‌లేని కాలమ్‌ను డిలీట్ చేసుకోవచ్చు.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + = (ఈక్వల్ కీ)
ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరమైన చోట కొత్త కాలమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఒక వర్క్ షీట్ నుంచి మరొక వర్క్ షీట్‌కు మారేందుకు కీబోర్డ్‌లోని CTRL + PGDN, CTRL + PGUP షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తే సరిపోతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Quick Time-Saving Excel Shortcuts. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot