మీ MAC స్పీడ్ పెంచే పది చిట్కాలు ఇవి

Posted By: ChaitanyaKumar ARK

ప్రపంచంలో అనేకరకాల డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా అందులో UI(యూసర్ ఇంటర్ఫేస్),సెక్యూరిటీ, మెమరీ మేనేజ్మెంట్ పరంగా వినియోగదారుల మనసు దోచుకున్నవి మాత్రం మూడే. అవి మైక్రోసాఫ్ట్ విండోస్, LINUX, MacOS. కాని ఎక్కువ పోటీ మాత్రం విండోస్ మరియు MacOS మద్యనే ఉంటుంది. విండోస్ బడ్జెట్ యూసర్స్ ని దృష్టిలో ఉంచుకుని ఆపరేటింగ్ సిస్టం ఇస్తుంది.

మీ MAC స్పీడ్ పెంచే పది చిట్కాలు ఇవి

కాని MacOS కావాలి అంటే కాస్త ఖరీదు ఎక్కువ పెట్టాల్సిందే. కాని సెక్యూరిటీ, UI, మెమరీ మేనేజ్మెంట్ భాగాలలో MacOS ఎప్పుడూ ముందు ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాని అంత ఖరీదు పెట్టి తీసుకున్న MACసిస్టం కూడా తగుజాగ్రత్తలు తీసుకోకుంటే ఆప్రభావం దాని పనితీరుపై పడి నెమ్మదిస్తుంది. అలాంటి సమయాల్లో కొన్ని టెక్నిక్స్ ఫాలో అవడం మూలం గా తిరిగి యదాస్థితికి తీసుకుని రావొచ్చు.

ఇప్పుడు వస్తున్న మాక్ బుక్స్ లో మామూలు హార్డ్ డిస్కులతో పోలిస్తే ఎక్కువ కాలం డేటా పోకుండా, మరియు పనితీరుని మెరుగు పరచడానికి సాలిడ్ స్టేట్ డివైస్(SSD)లని వాడుతున్నారు. ఇవి కాస్త తక్కువ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంటాయి.

డేటా పెరిగే కొద్దీ స్టోరేజ్ తగ్గుతూ వస్తుంది. స్టోరేజ్ తగ్గే కొద్దీ ఆ ప్రభావం పనితీరుపై పడుతుంది. అవసరంలేని ఫోల్డర్స్ లోని files అత్యధిక స్థాయిలో మెమరీ వినియోగించుకోవడం మూలంగా లేక స్టోరేజ్ ఎక్కువ ఉండడం మూలంగా హార్డ్ డిస్క్ రెస్పాన్స్ టైం తగ్గడం వలన పనితీరు మందగిస్తుంది. ఎప్పటికప్పుడు డేటాని క్లౌడ్ లేదా, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లోనికి కాపీ చేస్కుంటూ, అవసరం అయినవి మాత్రమే మాక్ బుక్ లో ఉండునట్లు జాగ్రత్త తీసుకోవాలి. డేట్ టైం ప్రకారం వాటిని ఆర్డర్ లో ఉంచి అనవసరమైనవి తొలగించి అవసరమైన వాటివరకే బాకప్ తీసుకోవడం ఉత్తమం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిస్టం cache తొలగించడం:

విండోస్ సిస్టంస్ లో Ccleaner లాంటి అప్లికేషన్స్ తెలియని వారు ఉండరు. ఇలాంటి థర్డ్ పార్టీ టూల్స్ ని ఉపయోగించి రెగ్యులర్ గా cache క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మాక్ లో కూడా cacheని రెగ్యులర్ గా తొలగించడం మూలంగా ఉపయోగంలేని ఫైల్స్ మెమరీని వినియోగించకుండా అడ్డుకోవచ్చు.

ఆ cache ఫైల్స్ అన్నీ కింద చూపిన లింక్ లో ఉంటాయి. Finder>Go(టాప్ మెన్యూ)> Go to folder ఇక్కడ ~/library/Caches అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. అక్కడ కనిపించిన వాటిని సెలెక్ట్ చేసుకుని ట్రాష్ లోనికి పంపండి.

మీ MAC స్పీడ్ పెంచే పది చిట్కాలు ఇవి:

1. క్లీనింగ్ అప్లికేషన్స్ వినియోగం :

కొన్నిసార్లు వేల ఫోల్డర్లు దర్శనం ఇస్తుంటాయి. వాటిలో ఉపయోగం లేనివికూడా ఎక్కువశాతం ఉంటాయి. ఆర్డర్ లో అమర్చుకుని క్లీన్ చెయ్యడానికి చాలా సమయమే పడుతుంది. దానికన్నా cleanMyMac3వంటి అప్లికేషన్ వాడడంద్వారా ఆపనులన్నీ ఇదేచేసి మీ సమయాన్ని తగిస్తుంది. ముందుగా MAC పర్ఫార్మెన్స్ ఎలాఉంది, సిస్టం స్లో అవుతుంది అని అనుమానం వచ్చినప్పుడు నోటిఫికేషన్ ద్వారా అలర్టు చేస్తుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే క్లీన్ చేస్తుంది.

cache మరియు టెంపరరీ ఫైల్స్ ని తొలగిస్తుంది సెక్యూర్డ్ గా. దీనిని ఈలింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనవచ్చు.https://macpaw.com/cleanmymac దీని పెయిడ్ వర్షన్ ఇంచుమించు 40డాలర్లుగా ఉంటుంది. కాని సమయాన్ని తగ్గిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. ఇలాంటివి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మార్కెట్ లో. అందులో diskCleanPro, DiskInventoryX, DaisyDisk, CCleaner, DataRescue, DiskDoctor, Dr.Cleaner ఎక్కువమంది ఉపయోగిస్తున్న టూల్స్ గా చెప్పుకోవచ్చు.

2.

ఎంత ఎక్కువ రామ్ ఉన్నా కూడా, ఎక్కువ ఫ్రీ మెమరీ ఉండేలా చూసుకోవాలి. వీలయితే ఆటోమేటిక్ ప్రొటెక్షన్ ఇచ్చే అప్లికేషన్స్ లో ఆ ఆప్షన్ ని డిసేబుల్ చెయ్యడం మంచిది.

3. విసువల్ ఎఫెక్ట్స్ అవసరం ఉంటేనే వాడుకోవాలి, అవసరంలేని పక్షంలో టర్న్ ఆఫ్ చెయ్యడమే మంచిది.

4. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్ రిపైర్ చెయ్యడం, తొలగించినప్పుడు cache తొలగించడం ఖచ్చితంగా చెయ్యాలి.

5. అవసరంలేని ఫాంట్స్ తొలగించడమే మంచిది. మెమరీ యూసేజ్ పెరగకుండా.

6. సిస్టం ప్రిఫరెన్స్ లో ఎనర్జీ సేవర్ ఆప్షన్ ఉంటుంది కొన్ని మాక్ సిస్టమ్స్ లో, అవసరం అనిపిస్తే దానిని అడ్జస్ట్ చేసుకోవడం మంచిది.

7. ఎక్కువకాలం మాక్ వాడకపోవడం వలన కూడా ప్రాసెసర్, బాటరీ పనితీరు మందగిస్తుంది. అందుచేత రెగ్యులర్ గా వాడుతూ ఉండడం మంచిది.

8. ఆక్టివిటీమానిటర్(విండోస్ లో టాస్క్ మేనేజర్ లాగా)ని రెగ్యులర్ గా చూడాలి. దీనిద్వారా ఏఅప్లికేషన్స్ ఎక్కువ మెమరీని వినియోగించుకుంటున్నాయో తెలుస్తుంది. తద్వారా అప్లికేషన్ ఆపివేయడమో లేక అవసరం అయితే తొలగించడం చెయ్యడంద్వారా పనితీరు పెంచుకోవచ్చు.

9. ఒక్కోసారి నెట్వర్క్ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. wifi, బ్లూటూత్ కనెక్టివిటీలను సెక్యూర్ గా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది.

10. సఫారీ, క్రోం, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌసర్లలో ఆడ్ ఆన్స్ ఎక్కువ అయితే కూడా పనితీరు మందగిస్తుంది. కావున అవసరంలేనివి తొలగించడం ఉత్తమం.

గూగుల్ తేజ్‌లో మరో సరికొత్త ఆప్సన్, రూ.1000 వరకు నగదు గెలుచుకునే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Quick ways to speed up a slow mac
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot