వేలం పాటలో యాపిల్ పాత కాలం మదర్ బోర్డ్..!

Posted By:

ఈ మదర్ బోర్డ్ విలువ 2.85కోట్లు..!

పై చిత్రంలో మీరు చూస్తున్న మదర్ బోర్డ్ వాస్తవానికి పనికిరానిదే. మూలన ఉండాల్సిన ఈ పాతకాలపు సాంకేతిక పరికరానికి పెద్ద చరిత్రే ఉంది. ఈ మదర్ బోర్డు‌ను తొలి యాపిల్ కంప్యూటర్ ‘యాపిల్-1'లో ఉపయోగించటం కారణంగా ప్రాధాన్యత ఏర్పడింది. యాపిల్ ప్రవేశపెట్టిన మ్యాక్ బుక్స్, ఐపాడ్స్ ఐపోన్స్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులకు ప్రేరణగా నిలిచిన ఈ మదర్ బోర్డును న్యూయర్క్‌లో వచ్చే వారం నిర్వహించే వేలం పాటలో విక్రయించనున్నారు. వేలంలో ఈ మదర్ బోర్డు విలువ 5,00,000 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2.85 కోట్లు) పలికే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యాపిల్ ఉత్సత్తులకు సంబంధించిన ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి

కాలీఫోర్నియాకు చెందిన టెడ్ ఫెర్రీ 1979-1980లో వస్తు మార్పిడి క్రింద వేరు వస్తువు ఇచ్చి యాపిల్ -1 మదర్ బోర్డుతో కూడిన కంప్యూటర్‌ను తీసుకున్నారు. ఫెర్రీ వద్ద నుంచి ఈ మదర్ బోర్డును సేకరించిన క్రిస్టీ కంపెనీ వచ్చే వారం నిర్వహించే వేలంపాటలో ప్రదర్శనకు తీసుకురానుంది. 2011 అక్టోబరులో స్టీవ్ జాబ్స్ మరణించిన తరువాత పాత కాలం నాటి యాపిల్ ఉత్పత్తులకు ప్రజల్లో మోజు పెరుగుతున్న విషయం తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting