మోడ్రెన్ పల్లెకు, ‘రిలయన్స్’ నాంది!!

రూ.500లకే సెల్‌ఫోన్ పరికారన్ని విడుదల చేసి గ్రామీణ ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత సులభతరం చేసిన రిలయన్స్, ఇప్పుడు రూ.9999కే ల్యాప్‌టాప్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
గ్లోబల్ చిప్ తయరీదారు ఇంటెల్, ల్యాప్‌టాప్ పరికరాల తయారీదారు ‘అసస్’లతో ఆర్‌కామ్ ఒప్పందం కుదర్చుకుంది. దిగ్గజ బ్రాండ్ల కలయకతో విడుదల కాబోతున్న ఈ సరికొత్త నెట్‌బక్ పరికరం పేరు ‘Asus Eee PCX101’.
ఈ నెట్‌బుక్ పరికాలకు రిలయన్స్ ‘బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ’ను సమకూరుస్తుంది. ఆధునిక ఫీచర్లతో ‘అసస్’ ఈ నెట్‌బుక్ పరికరాలను రూపొందించింది. ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌గా వినియోగదారులకు చేరువైన ‘MeeGo’ ఆపరేటింగ్ వ్యవస్థను ‘అసస్’ ఈ గ్యాడ్జెట్‌లో పొందుపరిచింది.
రిలయన్స్, ఇంటెల్, అసస్‌ల తాజా ఒప్పందంతో, గ్రామీణుల కల ఇక నెరవేరునట్లే. త్వరలో చోటుచేసుకుంటున్న ఈ ఆవిష్కరణ సరికొత్త గ్రామీణానికి నాందిపలుకుతుందేమో వేచి చూడాలి మరి!!.


Click it and Unblock the Notifications








