ఆర్‌కామ్‌ 3జీ టాబ్లెట్‌ కంప్యూటర్‌..!!

Posted By: Staff

ఆర్‌కామ్‌ 3జీ టాబ్లెట్‌ కంప్యూటర్‌..!!

ఇండియన్ మొబైల్ సామ్రాజ్యంలో తనదైన పాత్ర పోషించిన ‘అంబానీ’ రిలయన్స్ కమ్యూనికేషన్ తన పరిధిని మరింత విస్తరూస్తూ ‘టాబ్లెట్ కంప్యూటర్’ మార్కెట్లకి అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ‘ఆర్‌కామ్ 3జీ టాబ్లెట్ కంప్యూటర్‌ను’ మార్కెట్లో విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ 2.3తో పని చేసే ఆర్‌కామ్ (Rcom) టాబ్లెట్ కంప్యూటర్ ధర రూ.12999. అందుబాటు ధరలో అన్ని సౌకర్యాలు కలిగిన ఈ టాబ్లెట్ వినియోగదారులను మరింత సంతృప్తిపరుస్తుందని రిలయన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వార్షిక, నెల వారీ డేటా ప్లాన్ల పై రాయితీతో టాబ్లెట్లను అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి.

అయితే వీటిని ముంబయి, ఢిల్లీ, కోల్ కతా రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. త్వరలో దేశ్యవాప్తంగా 13 సర్కిళ్లలో వీటిని ప్రవేశపెట్టునున్నారు. అయితే ఆర్‌కామ్ 3జీలో పొందుపరిచిన 7 అంగుళాల డిస్ ప్లే టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 512 ఎంబీ, 32 జీబీ డేటా స్టోరేజీ కార్డు వరకు సపోర్ట్ చేసే మైక్రో ఎస్ డీ లు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటాయి.

ఇక టాబ్లెట్ ముందు, వెనుక భాగల్లో అమర్చిన ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు 2 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్, టీవి ఓవర్ మొబైల్, జీపీఎస్ (GPS) ద్వారా నావిగేషన్ వంటి 3జీ ఫీచర్లు వినియోగదారులకు మరింత సౌలభ్యత కల్పిస్తాయి. పలు డాక్యుమెంట్లను ఎడిటింగ్ చేసుకోవటంతో పాటు పలు ఇంటర్నెట్ ఆప్లికేషన్లను ముందుగానే ఆర్‌కామ్ 3జీలో లోడ్ చేశారు. ఇండియాలో 3జీ మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో రిలయన్స్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot