ఆర్‌కామ్ సీడీఎంఏ ట్యాబ్లెట్

Posted By: Super

ఆర్‌కామ్ సీడీఎంఏ ట్యాబ్లెట్

 

టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సోమవారం సీడీఎంఏ ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. సీడీఎంఏ టెక్నాలజీతో దేశంలోనే ఇది తొలి ట్యాబ్లెట్ పీసీ అని పేర్కొంది. ఏడు అంగుళాల కెపాసిటేటివ్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పీసీలో 32 జీబీ స్టోరేజి ఉంటుంది. మొబైల్ టీవీ, వాయిస్ కాలింగ్, జీపీఎస్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీని ధర రూ. 12,999 ఉంటుందని సంస్థ వైర్‌లెస్ బిజినెస్ - హబ్ హెడ్ రాకేశ్ సింగ్ తెలిపారు. దాదాపు రూ. 2,100 విలువ చేసే యాంటీవైరస్ ప్యాకేజి (ఏడాది పాటు), ఇతరత్రా ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఏడాదికి సుమారు 40 శాతం దాకా డిస్కౌంట్లు లభించేలా కస్టమైజ్డ్ ప్లాన్స్‌ను అందిస్తున్నట్లు సింగ్ పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot