విండోస్ యూజర్ల కోసం రెడ్‌బస్ అప్లికేషన్!

Posted By:

దేశంలోని ప్రముఖ ఆన్‌‍లైన్ బస్ టికెటింగ్ కంపెనీ రెడ్‌బస్.ఇన్ (RedBus.in) బుధవారం విండోస్ 8 పీసీ ఇంకా విండోస్ ఫోన్ యూజర్ల కోసం రెడ్‌బస్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్‌ను వినయోగించుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా 12,000రూట్లకు సంబంధించి 700 పై చిలుకు లగ్జరీ బస్ ఆపరేటర్ల ప్రయాణ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. మీ ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ పాయింట్స్, బస్ ట్రాకింగ్, జర్నీ టిప్స్, బస్ లోకేషన్, స్పెషల్ ఆఫర్స్ వంటి వివరాలను ఆ అప్లికేషన్ తెలియజేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 విండోస్ యూజర్ల కోసం రెడ్‌బస్ అప్లికేషన్!

రెడ్‌బస్.ఇన్, ఈ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో రూపొందించటం జరిగింది. ఈ అప్లికేషన్ ఆవిష్కరణ సందర్భంగా రెడ్‌బస్.ఇన్ సీఈఓ ఫణీంద్ర సామా మాట్లాడుతూ తాము విడుదలచేసిన రెడ్‌బస్.ఇన్ విండోస్ అప్లికేషన్ వినయోగదారులకు ప్రయాణఅవసరాలను తీర్చటంలో మరింత ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు. విండోస్ ఫోన్‌లతో పాటు విండోస్ 8 పీసీలను దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగిస్తున్న నేపధ్యంలో తాము విడుదల చేసిన విండోస్ అప్లికేషన్ విజయవంతం కాగలదని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఈ అప్లికేషన్ ఆవిష్కరణ సందర్భంగా రెడ్‌బస్.ఇన్, విండోస్8 యూజర్లకు ప్రత్యేక ఆఫర్లను కల్పిస్తోంది. రూ.500 విలువ చేసే టికెట్ కొనుగోలు పై రూ.75 తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 31,2013 వరకు మాత్రమే.

విండోస్ 8 పీసీ యూజర్లు రెడ్‌బస్.ఇన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ యూజర్లు రెడ్‌బస్.ఇన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot