ఇద్దరిలో ఎవరో ఆ ‘ఘనాపాటి’...!!

Posted By: Super

ఇద్దరిలో ఎవరో ఆ ‘ఘనాపాటి’...!!

రిలియన్స్ కమ్యూనికేషన్స్ నుంచి తొట్ట తొలతగా విడుదలైన ధర తక్కువ రిలయన్స్ 3జీ టాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో దుమ్ముదులుపుతున్న విషయం తెలిసిందే. ఇక మార్కెట్లో తక్కువ ధర టాబ్లెట్ల గురించి మాట్లాడితే.. నూతనంగా విడుదలైన ‘మెర్క్యరీ ఎమ్ ట్యాబ్’ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఆండ్రాయిడ్ v2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న రిలయన్స్ 3జీ టాబ్లెట్లను చైనా సంస్థ ‘ZTE’ తయారు చేసింది. ‘మెర్క్యరీ ఎమ్ ట్యాబ్’ విషయానికొస్తే ఆపరేటింగ్ వ్యవస్థ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు, 1.2GHz సామర్ధ్యం కలిగిన ట్రిపుల్ కోర్ ప్రొసెసర్ నాణ్యమైన పనితీరు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

డిస్ ప్లే విషయానికొస్తే ‘ఎమ్ ట్యాబ్’ టీఎప్టీ డిస్ ప్లే సామర్ధ్యం కలిగి ఉండగా, రిలయన్స్ 3జీ 7 అంగళాల సాధారణ టచ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మెమరీ విషయానికొస్తే 512 MB ర్యామ్ వ్యవస్ధ రెండు పరికరాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఎక్సటర్నల్ మెమరీని రెండు టాబ్లెట్లలో 32 జీబీకి పొడిగించుకోవచ్చు. అయితే రిలయన్స్ ప్రతి కోనుగోలుకు 4జీబీ మెమరీ కార్డును ఉచితంగా ఇస్తుంది.

కెమెరాల విషయానికొస్తే రిలియన్స్ 3జీ 2 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు, వీజీఏ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ‘ఎమ్ ట్యాబ్’ 1.3 మెగా పిక్సల్ సామర్ధ్యం గల ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే రిలయన్స్ 3జీ నెట్ వర్కింగ్ వ్యవస్థ అత్యంత వేగవంతంగా పనిచేస్తుంది. ‘ఎమ్ ట్యాబ్’లో 3జీ వ్యవస్థ కొరవడింది ఈ లోటును తీరుస్తూ వై - ఫై (IEEE 802.11 b/g/n) వ్యవస్థను పొందుపరిచారు. ‘యూఎస్ బీ డాంగిల్’ ద్వారా 3జీ వ్యవస్థను ఈ టాబ్లెట్ పీసీలో నడిపించవచ్చు.

డాక్యుమెంట్ వ్యూవర్స్, నావిగేషన్ ఆప్లికేషన్స్ వంటి అంశాలను ఈ సెట్లలో ముందుగానే లోడ్ చేశారు. ధరల విషయానికి వస్తే ‘మెర్క్యురీ ఎమ్ ట్యాబ్’ ధర రూ.9499 ఉండగా, రిలయన్స్ 3జీ ధర రూ.12,999 ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot