రిలయన్స్ సరికొత్త 3జీ టాబ్లెట్!

Posted By: Staff

రిలయన్స్ సరికొత్త 3జీ టాబ్లెట్!

ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే సరికొత్త 3జీ టాబ్లెట్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్ ప్రకటించింది). మార్కెట్లో ఈ సొగసరి కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.14,400. జీఎస్ఎమ్ ఇంకా సీడీఎమ్ఏ నెట్‌వర్క్ వర్షన్‌లలో ఈ డివైజ్ లభ్యంకానుంది.

3జీ అదేవిధంగా సీడీఎమ్ఏ నెట్‌వర్క్ కాంభినేషన్‌లో టాబ్లెట్ పీసీని రూపొందించిన ఘనత తొలిగా తమకే దక్కిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫీచర్లు:

7 అంగుళాల సమర్ధవంతమైన టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

1.4గిగాహెట్జ్ హైస్పీడ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

3జీ కనెక్టువిటీ,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

4జీబి మైక్రోఎస్డీ కార్డ్.

టాబ్లెట్ కొనుగోలు పై రూ.6,250విలువ చేసే ఉచిత రాయితీలను ఆర్‌కామ్ అందిస్తోంది. 3జీబి ఉచిత 3జీ డేటాతో పాట ఉచిత వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot