Home
Computer

ఫోటో పై EXIF డేటాను తొలగించటం ఎలా..?

By Bommu Sivanjaneyulu

ఫోటోగ్రఫీ మీద మక్కువతో మనలో చాలా మంది యూజర్లు కెమెరాలను వినియోగిస్తున్నారు. కెమెరాల ద్వారా ఫోటోలను క్యాప్చుర్ చేసినపుడు ఫోటోతో పాటు లోకేషన్, డేటా ఇంకా టైమ్ Text రూపంలో సేవ్ అయిపోతుంటంది. ఇలా ఫోటో పై సేవ్ అయిన డేటానే EXIF (Exchangeable Image File Format) meta-data అని పిలుస్తారు.

Remove personal info from photos in Windows 10

కెమెరాలోని జీపీఎస్ లోకేషన్ ఆధారంగా నమోదయ్యే ఈ EXIF డేటాలో లొకేషన్, తేదీ ఇంకా సమయంతో పాట కెమెరా మోడల్, అపెర్చుర్, ISO స్పీడ్, focal length వంటి అంశాలు కూడా ఫీడ్ అవుతాయి. ప్రొఫెషల్ ఫోటోగ్రాఫర్లకు ఈ డేటా చాలా అవసరమైనప్పటికి, కామనర్‌కు మాత్రం ఈ సమాచారంతో పెద్దగా అవసరం ఉండదు. ఫోటో పై సేవ్ అయిన EXIF డేటాను తొలగించేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

స్టెప్ 1: EXIF డేటాను తొలగించాల్సి వచ్చిన ఫోటోలను ముందుగా మీ విండోస్ 10 కంప్యూటర్‌లోకి సేవ్ చేసుకోండి.

స్టెప్ 2: ఇప్పుడు ఒక్కో ఫోటోను సెలక్ట్ చేసుకుని, ఆ ఫైల్ పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్స్‌తో కూడిన సబ్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. వాటిలో 'Properties' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3:'Properties' మెనూలోని 'Details' పై క్లిక్ చేయండి.

స్టెప్ 4:'Details' మెనూలో ఆ ఫైల్‌కు సంబంధించిన EXIF meta-data వివరాలు మీకు కనిపిస్తాయి. వీటిని రిమూవ్ చేసుకునేందుకు మెనూ క్రింద కనిపించే Remove Properties and Personal Information లింక్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5:Remove Properties and Personal Information లింక్‌లోకి వెళ్లిన తరువాత అక్కడ EXIF meta-data తాలుకా ప్రోపర్టీస్ కనిపిస్తాయి. వాటిలో రిమూవ్ చేయాలనుకుంటున్న ప్రోపర్టీస్ పై టిక్ మార్క్ చేసి OK బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫోటో పై మీరు వద్దనుకుంటున్న EXIF meta-data తొలగించబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Whenever you take pictures from your camera some information including the location where the picture was shot, date and time re saved along with the image. So in this article, we will show you how to remove the EXIF from your photo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X