చాలా చూపించింది.. అయినా ఫ్లాపే..?

Posted By: Staff

చాలా చూపించింది.. అయినా ఫ్లాపే..?

 

గత ఏడాది చివరిలో విడుదలైన ‘అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రైమ్’ టాబ్లెట్ కంప్యూటర్ మార్కెట్లో చతికలబడింది. వినియోగదారుల అవసరాలను తీర్చటంలో ఈ గ్యాడ్జెట్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ డివైజ్‌ను కోనుగోలుచేసిన వారు సాంకేతికంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన జీపీఎస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డివైజ్ అర్థంతరంగా లాక్ పడిపోతుందని, సిగ్నల్ రిసీవ్ చేసుకోవటంలో ఆలస్యంగా స్పందిస్తూదంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ అమ్మకాలు నిర్వహిస్తున్న రిటైల్ స్టోర్‌లకు వినియోగదారుల నుంచి ఈ విధమైన ఫీడ్‌బ్యాక్ అందటంతో వీటి అమ్మకాలు నిలిపివేసినట్లు యూకే రిటైలర్ క్లవ్ తెలిపారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు వీటి అమ్మకాలను పున:ప్రారంభించబోమని రిటైలర్ వెల్లడించారు. నెలకున్న పరిస్ధితుల పై అసస్ వర్గాలు స్పందిస్తూ లోపాలను సవరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఓ ప్రకటనను వెలువరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting