‘శ్యామ్ సంగ్ RC 510’ సమీక్ష..!!

Posted By: Super

‘శ్యామ్ సంగ్ RC 510’ సమీక్ష..!!

శ్యామ్‌సంగ్ సరికొత్త ల్యాప్‌టాప్ ‘RC 510’ను అద్భుతమైన స్టైలీ ఫినిష్‌తో తీర్చిదిద్దారు. ఈ గాడ్జెట్‌లో పొందుపరిచిన ఫీచర్లను పరిశీలిస్తే అధునాతన ఇంటెల్ కోర్ i3 380M ప్రొసెసర్, శక్తివంతమైన 3GB DDR 1066 MHz ర్యామ్, గ్రాఫిక్ వ్యవస్థను పటిష్ట పరిచే న్విడియో ఆప్టిమస్ టెక్నాలజి, గ్రాఫిక్ వ్యవస్థను సపోర్ట్ చేసే 500 జీబీ హార్డ్ డ్రైవ్ వంటి అంశాలు వినియోగదారునుకి మరింత లబ్థి చేకూరుస్తాయి.

ఇక హార్డ్ డ్రైవ్ పనితీరు అత్యంత వేగవంతంగా పనిచేస్తుంది. ఖచ్చితమైన కొలతలతో అమర్చిని 1.3 మోగా పిక్సల్ కెమెరా నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. ఇక ఎల్‌సీడీ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఆకట్టుకునే డీసెంట్ రంగుల్లో తీర్చిదిద్దారు. 15.6 అంగుళాల స్ర్కీన్ సైజు 1366 X 768 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. పొందుపరిచిన లౌడ్ స్పీకర్ నాణ్యమైన ఆడియోను అందిస్తుంది. రియాల్టెక్ ALC269 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ‘RC510’ పనిచేస్తుంది.

ల్యాప్‌టాప్‌‌లో పొందుపరిచిన యూఎస్‌బీ పోర్టు, ల్యాన్, వై - ఫై, బ్లూటూత్, వీడియో అవుట్ ఆప్షన్లు వీజీఏ, డీవీఐ, హెచ్ డీఎమ్‌ఐ వంటి అంశాలు సమర్థవంతమైన పనితీరును వినియోగదారునికి అందిస్తాయి. అత్యాధునిక హంగులతో రూపొదించబడిన శ్యామ్‌సంగ్ ‘RC510’. సాధారణ ల్యాప్‌టాప్ లతో పోలిస్తే ఈ అధునాతన పరికరం మరింత ఉత్తమం. ఇండియన్ మార్కెట్లో ‘RC510’ ధర రూ.39990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot