ఎట్టకేలకు ‘బ్లాక్ బెర్రీ’ ఆ నిర్ణయం తీసకుంది..?

Posted By: Prashanth

ఎట్టకేలకు ‘బ్లాక్ బెర్రీ’ ఆ నిర్ణయం తీసకుంది..?

 

బ్లాక్ బెర్రీ ప్లేబుక్ వోఎస్ 2.0 అప్‌డేట్‌కు సంబంధించి ఆ మధ్య టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన రూమర్స్ ఎట్టకేలకు నిజం కానున్నాయి. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) ప్లేబుక్ వోఎస్ తాజా అప్‌డేట్‌కు సంబంధింది ముహుర్తాన్ని ఖరారు చేసింది. వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’లో ప్లేబుక్ వోఎస్ 2.0కు సంబంధించి పూర్తి సమచారాన్ని ప్రదర్శించనున్నట్లు రిమ్ అధికార వర్గాలు ఉటంకించాయి.

బ్లాక్ బెర్రీ ప్లేబుక్ మునుపటి వోఎస్‌లో లోపాలున్నాయంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపధ్యంలో పరిగణంలోకి తీసుకున్న బ్లాక్‌బెర్రీ రిసెర్చ్ బృందం వాటిని అధిగమించే క్రమంలో కొత్త అప్‌డేట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ తాజా నవీకరణలో స్వల్ప ప్రతికూల లక్సణాన్ని గమనించవచ్చు. మెయిల్, మెసంజర్ వంటి యాక్సిస్ సర్వీస్‌లకు సహకరించే బ్లాక్‌బెర్రీ బ్రిడ్జ్ వ్యవస్థ ప్లేబుక్ వోఎస్ 2.0లో లోపించినట్లు తెలుస్తోంది.

ఈ సమస్యను అధిగమించేందకు బ్లాక్ బెర్రీ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్‌ను విడుదల చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం వల్ల అన్ని ప్రముఖ అప్లికేషన్‌లతో పాటు ఆండ్రాయిడ్, సింబియాన్ వంటి ప్లాట్ ఫామ్‌లు బ్లాక్‌బెర్రీ డివైజ్‌లకు సహకరిస్తాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting