బ్లాక్‌బెర్రి లేటెస్ట్ న్యూస్!!

Posted By:

బ్లాక్‌బెర్రి  లేటెస్ట్ న్యూస్!!

 

న్యూఢిల్లీ : బ్లాక్ బెర్రీ ప్లేబుక్ యూజర్లకు శుభవార్త... బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న కెనడా కంపెనీ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తన ప్లేబుక్ టాబ్లెట్ల కోసం సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను (ఒఎస్) అభివృద్ధి చేసింది. దీనిని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ ఒఎస్‌లో అదనంగా కొత్త ఫీచర్లను జోడించడం వల్ల ఆండ్రాయిడ్ అప్లికేషన్లను కూడా రన్ చేయడానికి అవకాశం ఉంటుందని రిమ్ మేనేజర్ (క్యారియర్ ప్రొడక్ట్, భారత్) రంజన్ మోసెస్ ఇక్కడ విలేకరులకు తెలిపారు. కొత్తగా తెచ్చిన బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఒఎస్ 2.0లో అడ్వాన్స్‌డ్ మెసేజింగ్ ఫీచర్లతో పాటు సోషల్ ఇంటిగ్రేషన్, మెరుగైన పనితీరును కనబరిచే బ్రౌజర్ ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కొత్త ఒఎస్‌ను పాత యూజర్లు ఉచితంగానే అప్‌డేట్ చేసుకోవచ్చని, కొత్తగా వచ్చే ప్లేబుక్స్‌లో ఈ ఒఎస్ ఇన్‌బిల్ట్‌గా వస్తుందన్నారు. ప్రస్తుతం 64 జిబి సామర్థ్యం కలిగిన బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ 19,900 రూపాయలకు లభిస్తోంది. గత డిసెంబర్‌లో ప్లేబుక్‌లను విక్రయించేందుకు బ్లాక్‌బెర్రీ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. 16 జిబి వెర్షన్ ధరను సగానికి సగం తగ్గించి 13,490 రూపాయలకే కంపెనీ విక్రయించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot