రిమ్ 4జీ టాబ్లెట్.. త్వరలో!!

Posted By: Prashanth

రిమ్ 4జీ టాబ్లెట్.. త్వరలో!!

 

ప్రపంచపు వేగవంతమైన నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్‌టీఈ (LTE) ఆధారిత కంప్యూటింగ్ డివైజ్‌లను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వచ్చి చేరింది. ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారితంగా పనిచేసే ‘న్యూ ప్లేబుక్’ టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదల ఈ ఏడాది వరకు ఆలస్యమైంది.

ఆపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీనిచ్చే విధంగా తాము డిజైన్ చేసిన ప్లేబుక్ ఉంటుందని రిమ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమంజసమైన ధరకే ఈ ఆడ్వాన్సుడ్ కంప్యూటింగ్ డివైజ్ లభ్యం కానుంది . మే ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot