nbsp;ప్రపంచపు వేగవంతమైన నెట్ వర్క్ గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్ టీఈ (LTE) ఆధారిత కంప్యూటింగ్ డివైజ్ లను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వచ్చి చేరింది. ఎల్ టీఈ నెట్ వర్క్ ఆధారితంగా పనిచేసే lsquo;న్యూ ప్లేబుక్ rsquo; టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదలను ఈ ఏడాది వరకు ఆలస్యమైంది.ఆపిల్ ఐప్యాడ్ కు గట్టి పోటీనిచ్చేవిధంగా మా ప్లేబుక్ ఉంటుందని రిమ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమంజసమైన ధరకే ఈ అత్యుత్తమ ఆడ్వాన్సుడ్ కంప్యూటింగ్ డివైజ్ లభ్యం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మే ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర ఇతర స్పెసిఫికేషన్ ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.