పుకార్.. పుకార్.. పుకార్!

Posted By: Prashanth

పుకార్.. పుకార్.. పుకార్!

 

దిగ్గజ కంపెనీ ఆపిల్ త్వరలో ఆవిష్కరించున్న టాబ్లెట్ పీసీ ‘ఐప్యాడ్ మినీ’కి సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆపిల్ ఐప్యాడ్ కుటుంబంలో పలుచని శ్రేణి గ్యాడ్జెట్‌గా పిలవబడుతున్న ఐప్యాడ్ మినీ అగష్టులో విడుదలకానుందని నిన్నమొన్నటి వరకు ప్రచారం సాగింది. తాజాగా బహిర్గతమైన పలు నివేదికలు ‘ఐప్యాడ్ మినీ’ ఆవిష్కరణ అక్టోబర్‌లో ఉంటుందని స్పష్టం చేసాయి. ఇదిలా ఉండగా, ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 5 సెప్టంబర్‌లో విడుదలకానుందని మార్కెట్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు... ఐప్యాడ్ మినీ స్ర్కీన్ పరిమాణం 7 నుంచి 8 అంగుళాల మధ్య ఉంటుంది. ధర అంచనా రూ.13536 నుంచి రూ.16255 మధ్య. అక్టోబర్‌లో విడుదలకానున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2కు పోటీగా నిలిచే క్రమంలో ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ సమయాన్ని అప్పటికి మార్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఫీచర్ల (అంచనా):

5.5 అంగుళాల ఫ్లెక్సీబుల్ స్ర్కీన్,

8మెగాపిక్సల్ కెమెరా,

2జీబి ర్యామ్,

Exynos 5250 చిప్‌సెట్,

డ్యూయల్ కోర్ ఆర్మ్ 15 ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot