ఏ క్షణంలోనైనా ఉండొచ్చు..?

Posted By: Staff

ఏ క్షణంలోనైనా ఉండొచ్చు..?

 

భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకున్న శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 11.6 ఏ క్షణంలోనైనా  విడుదల కావచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఏ విధమైన సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ నేపధ్యంలో పలు రూమర్లు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో Exynos processorకు సంబంధించి ప్రమోట్ చేసిన ఓ ప్రకటన సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.  ఈ ప్రకటనలో ఓ వ్యక్తి Exynos processor కలిగిన టాబ్లెట్ పీసీని చూపుతాడు. అతను చూపిన టాబ్లెట్ స్ర్కీన్ పరిమాణం 11.6 అంగుళాలు ఉండటంతో పలువురు ఈ డివైజ్ శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 11.6 అయ్ ఉండొచ్చని భావిస్తున్నారు.

శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 11.6 అంచనా ఫీచర్లు:

* 11.6 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్)

* Exynos ప్రాసెసర్ (2జిగాహెడ్జ్ క్లాక్ స్పీడ్),

*    ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot