రూమర్: మార్చిలో యాపిల్ ఐప్యాడ్5?

By Prashanth
|
Apple


టెక్ టైటాన్ యాపిల్ తన కొత్త వర్షన్ ఐప్యాడ్‌ను మార్చి 2013లో అందుబాటులోకి తేనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లు నిజమైతే ఐప్యాడ్4 విడుదలైన ఐదు నెలలకు ఐప్యాడ్5 అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. రాబయే డివైజ్ ప్రస్తుత వర్షన్ ఐప్యాడ్‌తో పోలిస్తే తక్కువ బరువు ఇంకా పల్చటి స్వభావాన్ని కలిగి ఉంటుంది.

 

టాప్-10 ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు

స్పెసిఫికేషన్‌లు (అంచనా):

చుట్టుకొలత: 224.5 మిల్లీమీటర్లు x 181.7 మిల్లీ మీటర్లు x 7.4 మిల్లీ మీటర్లు,

 

రెటీనా డిస్‌ప్లే,

ఏ6ఎక్స్ సీపీయూ.

ఎందుకిలా..?

ఆండ్రాయిడ్ ఇంకా విండోస్ ట్యాబ్లెట్‌ల నుంచి పోటీ ఉధృతమవుతున్న నేపధ్యంలో యాపిల్ త్వరితగతిన తన ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నటు విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్టోబర్‌లో విడుదలైన ఐప్యాడ్4 స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ మల్టీటచ్ డిస్‌ప్లే, ఐపీఎస్ టెక్నాలజీ రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే టెక్నాలజీ, యాపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్, ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 42.5డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీ (బ్యాకప్ – 10గంటలు).

ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల కస్టమర్ కేర్ నెంబర్లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X