రుపాయి ఎఫెక్ట్.. ల్యాప్‌టాప్ ధరలకు రెక్కలు?

Posted By: Staff

రుపాయి ఎఫెక్ట్.. ల్యాప్‌టాప్ ధరలకు రెక్కలు?

 

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతున్న నేపధ్యంలో  ఎలక్ర్టానిక్ వస్తువుల ధరలకు మరోసారి రెక్కలు రానున్నాయి.  ధరలు పెరిగే వస్తువుల జాబితాలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ పీసీలు, సెల్ ఫోన్లు, కెమెరాలతో పాటు ఇతర సాంకేతిక వస్తువులు ఉండబోతున్నాయి. రూపాయి విలువ మరింత బలహీనపడటంతో దిగుమతులు భారమై ముడి సరుకుల వ్యయం పెరగటంతో,  ధరలు పెరుగదలు అనివార్యం కానుందని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా  పరికరాల విడిభాగాలను దిగుమతి చేసుకని అసెంబుల్ చేసే కంపెనీలు సైతం ధరలు పెంచేందుకు సమాయుత్తమవుతున్నాయి. ల్యాప్‌టాప్‌లకు డాలర్ దెబ్బతో పాటు థాయ్‌లాండ్ వరదలు సమస్యను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే మోడల్‌ను బట్టి ల్యాప్‌టాప్‌లు ధరలు వెయ్యి నుంచి రెండు వేల వరకు పెరిగాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot