గ్రామీణ భారతం... ఆన్‌లైన్‌లో అమ్మకానికి గేదెలు, ఆవులు!

Posted By:

చక్కటి పోషణను కలిగి వంకర కొమ్ములతో ఉన్న నలుపు రంగు ముర్రే రకం గేదె ధర రూ.80,000. హోల్స్టీన్ రకం ఆవుల మంద 10 ఆవులు కలిపి రూ.6 లక్షలు. ఒక్క క్లిక్కుతో వీటిని మీ సొంతం చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో అమ్మకానికి గేదెలు, ఆవులు!

గ్రామీణ భారతం ఆధునీకం వైపు అడుగులు వేస్తోంది. ఇంటర్నెట్ వినియోగం దేశ నలుమూలలా విస్తరిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్ పరిజ్ఞానం పట్ల రైతలు అవగాహనను ఏర్పరచుకుంటున్నారు. వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాలను ఇంటర్నెట్ ద్వారాతెలుసుకుంటున్న రైతులు తమ పశుసంపదకు సంబంధించిన క్రయ విక్రయాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.

పశు విక్రయాలకు సంబంధించి ఈ తరహా ఆన్‌లైన్ విక్రయాలు వెస్ట్ బెంగాల్, తమిళ నాడు, కర్ణాటకా, మహారాష్ట్రా, ఒరిస్సా, ఆస్సాం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని సెమీ అర్బన్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఆన్‌లైన్ క్లాసీఫైడ్ సంస్థలైన క్వికర్  (Quikr) ఇంకా వోఎల్ఎక్స్ (OLX)లు ఈ వ్యాపారాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot