శ్యామ్‌సంగ్ 5 సిరీస్!!!

Posted By: Prashanth

శ్యామ్‌సంగ్ 5 సిరీస్!!!

 

కంప్యూటింగ్ సెక్టార్లో వేగవంతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు టెక్నాలజి ఎదిగుతున్న తీరు తెన్నులను మనం స్పష్టంగా గమనిస్తున్నాం. మన్నికైన కంప్యూటింగ్ వస్తువులను డిజైన్ చేయటంలో రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్‌సంగ్ 5 సిరీస్ వర్షన్‌లో అల్ర్టాబుక్ పరికరాలను రూపొందించింది. ఈ గ్యాడ్జెట్లు ఉన్నతమైన పనితీరును ప్రదర్శించే విధంగా యాజమాన్యం పటిష్ట చర్యలు తీసుకుంది. 13.3, 14 అంగుళాల స్ర్కీన్ సైజులో ఈ నెట్ బుక్ కంప్యూటర్ పీసీలను తయారు చేశారు. తక్కువ బరువు, అల్ర్టాపోర్టబుల్ మరియు స్టైలిష్ తరహాలో నిర్మించబడ్డ ఈ నోట్ బుక్ ఫీచర్లు:

- 13.4, 14 అంగుళాల స్ర్కీన్ సైజ్ వేరియంట్లలో లభ్యం,

- రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్,

- యాంటీ - రిఫ్లెక్టివ్ కోటింగ్,

- ఆల్యూమినియమ్ శరీరాకృతి,

- ఇంటెల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్,

- విండోస్ 7 హోమ్ ప్రీమియ్ ఆపరేటింగ్ సిస్టం,

- 16జీబి సాలిడ్ స్టేట్ డిస్క్,

- 8 జీబి ర్యామ్,

- Expresscache టెక్నాలజి,

- ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ,

- హెచ్డీఎమ్ఐ పోర్ట్స్,

- వై-ఫై,

- యూఎస్బీ పోర్ట్ సౌలభ్యత,

- ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ (ఈ ఫీచర్ 14 అంగుళాల వేరియంట్ కు మాత్రేమే వర్తిస్తుంది).

13.3 అంగుళాల స్ర్కీన్ సైజ్ అల్ర్టాబుక్ బరువు 1.4కిలో గ్రాములు కాగా 14 అంగుళాల స్ర్కీన్ సైజ్ గల అల్ర్టాబుక్ బరువు 1.8 కిలో గ్రాములు. హార్డ్ డిస్క్ అంశాలను పరిశీలిస్తే 13.3 అంగుళాల వేరియంట్లో 500 హార్డ్ డిస్క్, 14 అంగుళాల వేరియంట్లో 1 ట్యాబ్ హార్డ్ డిస్క్ ను నిక్షిప్తం చేశారు. విడుదల మరియు ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot