శ్యామ్‌సంగ్ ‘600 B5B’, ఫ్రొఫెష్‌నల్స్ కోసం!!

Posted By: Staff

శ్యామ్‌సంగ్ ‘600 B5B’, ఫ్రొఫెష్‌నల్స్ కోసం!!

ఫ్రొఫెష్‌నల్స్ కోసం.. ప్రొఫెషనల్ వస్తువులను రూపొందించటంలో అందవేసిన చేయ్యిగా ముద్రపడిన శ్యామ్‌సంగ్ మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు సాంకేతిక ప్రేమికులకు అందించటంలో సఫలీకృతమవుతుంది.

తాజాగా శ్యామ్‌సంగ్, ‘600 B5B’ మోడల్‌తో ఆధునిక ల్యాపీ పరికరాన్ని లాంఛ్ చేసింది. సాఫ్ట్‌ వేర్, ఐటి‌ రంగ ఉద్యోగులతో పాటు బీజినెస్ ఫ్రొఫెష్‌నల్స్‌ను మరింత ఆకట్టుకునే విధంగా సరికొత్త ఫీచర్లను ల్యాపీలో పొందుపరిచారు.

శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ పరికరం, 15.6 అంగుళాల పటిష్ట డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అత్యాధునిక కీబోర్డు వ్యవస్ధ సౌకర్యవంతమై టైపింగ్‌కు ఉపకరిస్తుంది. 2.5 కిలలో బరువు కలిగి ఉండే ల్యాపీ, 4జీబీ పటిష్ట ర్యామ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

డీవీడీ డ్రైవ్, ఇతర్‌నెట్ పోర్టు, యూఎస్బీ పోర్టు తదితర అంశాలు వేగవంతమైన ట్రాన్స్‌ఫరింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. సమర్థవంతమైన సెక్యూరిటీ వ్యవస్థను ల్యాపీలో పొందుపరిచారు. ధర విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో శ్యామ్‌సంగ్, ‘600 B5B’ల్యాపీ ధర రూ.30,000 ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting