మార్కెట్లోకి సామ్‌సంగ్ క్రోమ్‌బుక్

Posted By:

గూగుల్ అభివృద్ధి చేసిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంకు ఇండియన్ మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సరికొత్త సామ్‌సంగ్ క్రోమ్‌బుక్‌ను విడుదల చేసింది. ఈ క్రోమ్‌బుక్ ప్రారంభ వేరియంట్ ధర రూ.26,990.

గూగుల్ ఇటీవల కాలంలో హెచ్‌పి, ఏసర్ కంపెనీలు తయారు చేసిన క్రోమ్‌బుక్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయటం జరిగింది. ఆన్‌లైన్ షాపర్లు తాజాగా విడుదులైన సామ్‌సంగ్ క్రోమ్‌బుక్‌ను ఫ్లిప్‌కార్ట్, క్రోమారిటైల్.కామ్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. సాధారణ షాపర్లు రిలయన్స్ డిజిటల్, క్రోమా బ్రిక్ వంటి స్టోర్‌ల వద్ద సామ్‌సంగ్ క్రోమ్‌బుక్‌ను సొంతం చేసుకోవచ్చు.

మార్కెట్లోకి సామ్‌సంగ్ క్రోమ్‌బుక్

సామ్‌సంగ్ క్రోమ్‌బుక్‌ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే:

11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),
గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 డ్యూయల్ ప్రాసెసర్,
2జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్,
16జీబి సాలిడ్ స్టేట్ డ్రైవ్,
100జీబి గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ (రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో),
వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,
వైఫై, యూఎస్బీ కనెక్టువిటీ (2.0,3.0), హెచ్ డిఎమ్ఐ అవుట్, ఆడియో జాక్, బ్లూటూత్.
బ్యాటరీ బ్యాకప్6.5 గంటలు.

ప్రీలోడెడ్ ఫీచర్లు: గూగుల్ సెర్చ్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot