ఆల్‌రౌండ్ ప్రతిభ దీని సొంతం!

Posted By: Prashanth

ఆల్‌రౌండ్ ప్రతిభ దీని సొంతం!

 

సామ్‌సంగ్ సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. క్రోనోస్ 7 సిరీస్ నుంచి వస్తున్న ఈ ల్యాపీ మోడల్ నెం NP700Z. 15.6 అంగుళాల సూపర్ బ్రైట్ హై డెఫినిషన్ స్ర్కీన్. శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్. ఇతర కీలకాంశాలను పరిశీలిస్తే...

64బిట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్ క్యామ్, 4 వాట్ స్టీరియో స్పీకర్, హై డెఫినిషన్ ఆడియో, 8జీబి ఫ్లాష్ మెమరీ, 1ట్యాబ్ S-ATAII హార్డ్‌డ్రైవ్, యూఎస్బీ 2.0 పోర్టు, 1జీబి జీడీడీఆర్5, బ్లూటూత్ వీ4.0, ఇతర్‌నెట్ ల్యాన్, మల్టీ‌కార్డ్ స్లాట్, ఇంటెల్ హెచ్ఎమ్76 చిప్‌సెట్, నార్టాన్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, న్విడియా జీఫోర్స్ జీటీ640ఎమ్ గ్రాఫిక్ సపోర్ట్, ఆప్టిమస్ టెక్నాలజీ, సామ్‌సంగ్ రికవరీ సొల్యూషన్, హైబ్రీడ్ స్లీప్‌మోడ్, ఎక్స్‌ప్రెస్ క్యాచీ టెక్నాలజీ, టచ్‌ప్యాడ్, టర్బో‌బూస్ట్ టెక్నాలజీ. వీడీ సపోర్ట్, వై-ఫై,

వేగవంతమైన కంప్యూటింగ్‌ను ఈ ల్యాపీ ద్వారా ఆశించవచ్చు. కేవలం 2.1 సెకన్ల వ్యవధిలో డివైజ్ స్టార్ట్ అవుతుంది. 15.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ ఉత్తమ డిస్‌ప్లేను అందిస్తుంది. నిక్షిప్తం చేసిన క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరునందిస్తుంది. అత్యుత్తమమైన మల్టీ మీడియా వ్యవస్థను ల్యాపీలో నిక్షిప్తం చేశారు. ఏర్పాటు చేసిన యాంటీ రిఫ్లెక్టివ్ స్ర్కీన్ ఒత్తడి రహిత అనుభూతులను చేరువ చేస్తుంది. అల్ట్రా‌ఫాస్ కంప్యూటింగ్‌ను చేరువచేసే సామ్‌సంగ్ NP700Z ల్యాపీ ధర అంచనా రూ.65,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot