సామ్‌సంగ్ నుంచి ఫోల్డబుల్ ట్యాబ్లెట్ విడుదల కాబోతోందా..?

Posted By:

బార్సిలోనా (స్పెయిన్) వేదికగా ఫిబ్రవరి 24 నుంచి జరగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2014) పై టెక్ ప్రపంచంలో ఉత్కంఠపూరిత వాతావరణం నెలకుంది. ముఖ్యంగా సామ్‌సంగ్ ఆవిష్కరణల పై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఈ నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది.

 సామ్‌సంగ్ రహస్యం పై ఉత్కంఠ?

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఫోల్డబుల్ లేదా బెండబుల్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించే అవకాశముందని వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు 90 డిగ్రీల వరకు వొంగే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లెక్సిబుల్ కంప్యూటింగ్ సందర్భానికి అనుగుణంగా డివైస్‌ను ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లా వినియోగించుకోవచ్చని రూమర్ మిల్స్ అంటున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.

సామ్‌సంగ్ ఫిబ్రవరి 24న "Unpacked 2014 Episode 1" నిర్వహిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్5 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించనుంది. సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting