బ్రెజిల్ సామ్‌సంగ్ కంపెనీలో భారీ దొంగతనం!

Posted By:

శావో పోలో (బ్రెజిల్)లోని క్యాంపినాస్ నగరంలో గల సామ్‌సంగ్ ఫ్యాక్టరీలో సోమవారం అర్థరాత్రి భారీ దొంగతనం జరిగింది. బ్రెజీలియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన క్యాంపినాస్ వద్ద నెలకొల్పబడిన సామ్‌సంగ్ ఫ్యాక్టిరీలోకి 20 మంది దొంగలు చొరబడి 36 మిలియన్ డాలర్లు విలువ చేసే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లను దోచుకెళ్లారు.

బ్రెజిల్ సామ్‌సంగ్ కంపెనీలో భారీ దొంగతనం!

రాత్రిషిఫ్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న కంపెనీ బస్సును హైజాక్ చేసిన దొంగలు సదరు బస్సులోని 8 మంది ఉద్యోగులను బందీలుగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గుర్తింపుకార్డులు, సెల్‌ఫోన్‌లను లాక్కున్నారు. 8 మందిలో ఆరుగురిని గుర్తుతెలియని చోటుకు తరలించి, ఇద్దరితో ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించారు.

తమ వద్ద బందీలుగా ఉన్నవారిని చంపేస్తామని బెదిరించి కంపెనీలోని సెక్యూరిటీ సిబ్బంది వద్దనుంచి ఆయుధాలను లాక్కున్నారు. దీంతో, సెక్యూరిటీ సిబ్బంది సైతం చేతులెత్తేయటంతో దొంగలు మూడు గంటలపాటు ఫ్యాక్టరీలో దర్జాగా చోరికి పాల్పడుతూ వేల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లను ట్రక్కుల్లో వేసుకుని మరీ పరారయ్యారు.

ఈ ఘటనలో ఉద్యోగులెవరూ గాయపడలేదని, ఫ్యాక్టరీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot