Just In
- 12 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 17 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 19 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- News
Vastu tips: వంటగదికి ఆరోగ్యానికి లింక్.. కిచెన్ వాస్తు ఏం చెప్తుందంటే!!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ పై భారీ ధర తగ్గింపు.. రిటైల్ మార్కెట్లో రూ.18,999కే!
ధరింపదగిన కంప్యూటింగ్ డివైస్ (స్మార్ట్‌వాచ్)లకు 2013 పెద్దపీట వేస్తుందని టెక్నాలజీ ప్రపంచం భావించింది. అయితే, ఆశించిన స్థాయిలో వాటికి ఆదరణ లభించకపోవటంతో సోనీ, సామ్‌సంగ్ వంటి కంపెనీలు ధరింపదగిన కంప్యూటింగ్ డివైస్‌లను ప్రజలకు మరింత చేరువచేసే ప్రయత్నం చేస్తున్నాయి. కొత్తదనం నిండిన ఫీచర్లు లోపించటం ... అధిక ధర ట్యాగ్ వంటి అంశాలు స్మార్ట్‌వాచ్‌ల విజయానికి ప్రధాన అవరోధాలుగా నిలిచాయి.

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ గతేడాది మొదటి జనరేషన్ స్మార్ట్‌వాచ్ ‘గెలాక్సీ గేర్' (Galaxy Gear)ను మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ఈ ధరింపదగిన కంప్యూటింగ్ డివైస్ ధర రూ.22,990. ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు అంతర్జాతీయ మార్కెట్లో ఏలా ఉన్నప్పటికి రెండవ తరం గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. ఫిబ్రవరిలో నిర్విహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2014 వేదికగా గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్‌ను సామ్‌సంగ్ ప్రపంచానికి పరిచయం చేయనుంది.
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ పై భారీ ధర తగ్గింపు...!
రిటైల్ మార్కెట్లో తమ మొదటి వర్షన్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ అమ్మకాలను మరింత పెంచుకునే క్రమంలో సామ్‌సంగ్ ఇండియా ‘గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్' పై ధర తగ్గింపును ప్రకటించినట్లు సమాచారం. Mahesh Telecom పేరిట పోస్ట్ కాబడిన ఓ ట్వీట్‌లో ఈ ధర తగ్గింపుకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొన్నారు.
జవనరి 11 నుంచి ఈ ధర తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు సదరు ట్వీట్ పేర్కొంది. తాజా ధర తగ్గింపులో భాగంగా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌ను రూ.18,999కే వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ ధర తగ్గింపుకు సంబంధించి సామ్‌సంగ్ అధికారిక ప్రకటనను వెలువరించాల్సి ఉంది.
గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్.
ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను యువత ఫ్యాషన్ ఉపకరణంగానూ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సహచరునిగాను ఉపయోగించుకోవచ్చు. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటంతో డయల్ చేయవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గెలాక్సీ నోట్3, ఇంకా గెలాక్సీ నోట్ 10.1 2014 ఎడిషన్‌లను సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్‌లో గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ఎస్3 ఇంకా గెలాక్సీ నోట్3లను గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.గెలాక్సీ గేర్ స్మార్ట్ వాచ్ లోని 5 అత్యుత్తమ ఫీచర్లు
వాయిస్ కాల్స్, ఎస్ వాయిస్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. వాచ్‌లోని మరో ఫీచర్ ఎస్ వాయిస్‌తో వాతావరణం, ఆలారమ్ ఇంకా డ్రాఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
1.9 మెగా పిక్సల్ కెమెరా, మెమోగ్రాఫర్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన 1.9 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.
భిన్నమైన కలర్ వేరియంట్‌లు, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.
మ్యూజిక్ కంట్రోల్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌ను గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.
పిడో మీటర్: గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన పిడీమీటర్ ఫీచర్ మీ వ్యాయామ తీరుకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470