మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్!

Posted By: Super

మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్!

ప్రపంచవ్యాప్తంగా మెగా బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకన్న సామ్‌సంగ్ నుంచి మరో టాప్‌క్లాస్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ విడుదలకాబోతుంది. గెలాక్సీ నోట్ 10.1గా రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ ఆగస్లు చివరి నాటికి దేశీయ మార్కెట్లో లభ్యంకానుంది. ఈ డివైజ్‌కు సంబంధించి ఇప్పటికే సామ్‌సంగ్ ఇండియా ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. ఈ సౌలభ్యతతో ఓత్సాహికులు ముందస్త్తుగా రూ.2,000 చెల్లించి నోట్ 10.1ను బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు పై రూ.3,249 విలువ చేసే ‘ఫ్రీ బుక్ కవర్’ను ఉచితంగా పొందవచ్చు.

గెలాక్సీ నోట్ 10.1 కీలక స్పెసిఫికేషన్‌లు:

బరువు 580గ్రాములు,

10.1 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

ఎస్-పెన్ స్టైలస్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.4గిగాహెట్జ్ క్వాడ్ కోర్ Exynos ప్రాసెసర్,

స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి,

2జీబి ర్యామ్,

5మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),

1.9మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వై-ఫై 802.11 a/b/g/n,

బ్లూటూత్ 4.0,

మైక్రోయూఎస్బీ 2.0,

వై-ఫై హాట్ స్పాట్,

7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot