అమెరికా మార్కెట్లో ‘సామ్‌సంగ్ గెలాక్స్ నోట్ 10.1’

Posted By: Super

అమెరికా మార్కెట్లో ‘సామ్‌సంగ్ గెలాక్స్ నోట్ 10.1’

న్యూయార్క్: ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా సామ్‌సంగ్ వృద్ధి చేసిన టాబ్లెట్ పీసీ గెలాక్సీ నోట్ 10.1 అమెరికా మార్కెట్లో విడుదలైంది. రెండు మెమరీ వర్షన్‌లలో ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంది. మెదటి మెమరీ వర్షన్ 16జీబి ధర 500 డాలర్లు, రెండవ మెమరీ వర్షన్ 32జీబి ధర 550 డాలర్లు. ఈ వై-ఫై వర్షన్ టాబ్లెట్‌లలో ఎస్ పెన్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కంపెనీ వర్గాలు ఆవిష్కరణ సందర్భంగా పేర్కొన్నాయి. ఈ పెన్ సహాయంతో పేపర్ పై రాసినట్లే టాబ్లెట్ స్ర్కీన్ పై గుండ్రంగా స్ఫష్టంగా రాసుకోవచ్చు.

కీలక ఫీచర్లు:

1.4గిగాహెట్జ్ క్లాక్ వేగాన్ని కలిగిన శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ సామర్ధ్యం 2జీబి. 10.1 అంగుళాల WXGA ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, గ్యాడ్జెట్‌ను మరింత సులువుగా ఆపరేట్ చేసుకునేందుకు ‘పెన్ స్టైలస్ వ్యవస్థ’. ఆండ్రాయిడ్ 4.0

ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot