సామ్‌సంగ్‌తో మైక్రోమ్యాక్స్ ‘ఢీ’

Posted By: Staff

సామ్‌సంగ్‌తో మైక్రోమ్యాక్స్ ‘ఢీ’

సామ్‌సంగ్ అదేవిధంగా మైక్రో‌మ్యాక్స్‌లు వేరు వేరు ధరలో ఇంచు మించు ఓకే సారి రెండు టాబ్లెట్ పీసీలను ఆవిష్కరించాయి. సామ్‌సంగ్ ఆవిష్కరించన గ్యాడ్జెట్ ‘గెలాక్సీ నోట్ 10.1 ఫాబ్లెట్’ప్రస్తుతానికి భారత్‌లో ప్రీ‌ఆర్డర్ పై లభ్యమవుతోంది. డివైజ్ అధికారిక విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్షి ఉంది.

మరో వైపు మైక్రోమ్యాక్స్ ‘ఫన్‌బుక్ ప్రో’పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్‌కామ్ డివైజ్‌ను రూ.9,999కి ఆఫర్ చేస్తుంది.

మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ అధిక ముగింపు టాబ్లెట్ గెలాక్సీ నోట్ 10.1తో సరితూగలదా అన్న ప్రశ్న పలువురిలో ఉత్ఫన్నమవుతోంది. వీటి పీచర్లు మధ్య వృత్యాసాలను క్షుణ్నంగా పరిశీలిద్దాం..

డిజైనింగ్ ఇంకా డిస్‌ప్లే:

గెలాక్సీ నోట్ 10.1, 10 అంగుళాల ఉత్తమ శ్రేణి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది(రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 800 పిక్సల్స్). బరువు 580 గ్రాములు. ఫన్‌బుక్ 10 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది (రిసల్యూషన్ సామర్ధ్యం 1024 x 600పిక్సల్స్) . బరువు వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపరేటింగ్ సిస్టం:

ఈ రెండు డివైజ్‌లు ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

ప్రాససర్:

గెలాక్సీ నోట్ 10.1లో నిక్షిప్తం చేసన క్వాడ్‌కోర్ Exynos ప్రాసెసర్ 1.4గిగాహెడ్జ్ వేగాన్ని కలిగి ఉంటుంది. మరో వైపు ఫన్‌బుక్ ప్రో1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్‌ను ఒదిగి ఉంటుంది.

కెమెరా:

నోట్ 10.1లో అమర్చిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఆటోఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్, జియో టాగింగ్ ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన వీజీఏ కెమెరా క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను అందిస్తుంది.

ఇక ఫన్‌బుక్ ప్రో విషయానికొస్తే వీజీఏ ప్రంట్ కెమెరాను మాత్రమే ఏర్పాటు చేశారు. రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్:

గెలాక్సీ నోట్ 10.1 మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 16జీబి, 32జీబి, 64జీబి. ఇంటర్నల్ మెమెరీ ఇంకా 2జీబి ర్యామ్. మరో వైపు మైక్రోమ్యాక్స్ ప్రో 8జీబి ఫ్లాష్ మెమెరీ ఇంకా 1జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ ఆప్షన్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

కనెక్టువిటీ:

గెలాక్సీ నోట్ 10.1:

వై-ఫై Wi-Fi 802.11 a/b/g/n,

వై-ఫై డైరెక్ట్,

వై-ఫై హాట్‌స్పాట్,

బ్లూటూత్ 4.0,

ఏ2డీపీ,

మైక్రోయూఎస్బీ 2.0.

ఫన్‌బుక్ ప్రో:

వై-ఫై,

బ్లూటూత్ కనెక్టువిటీ,

3జీ వయా డాంగిల్.

బ్యాటరీ:

నోట్ 10.1లో శక్తివంతమైన 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఫన్బుక్ ప్రోలో 5600ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీని దోహదం చేశారు.

తీర్పు:

బడ్జెట్ పరంగా ఆలోచించే వారికి మైక్రోమ్యాక్స్ ఫన్బుక్ ప్రో సరిపోతుంది. ఆధునిక ప్రత్యేకతలతో కూడిన హైఎండ్ కంప్యూటింగ్ కోరుకునే వారికి గెలాక్సీ నోట్ 10.1 బెస్ట్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot