మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800

న్యూఢిల్లీ: దేశీయ టాబ్లెట్ పీసీల మార్కెట్లో 57శాతం వాటాను తన గుప్పెట్లో పెట్టుకున్న సామ్‌సంగ్ ఇండియా శుక్రవారం ‘గెలాక్సీ నోట్ 800’ టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. ధర రూ.39,990. ఈ కంప్యూటింగ్ డివైజ్ ప్రత్యేకతలను పరిశీలిస్తే...
10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
స్టైలస్ పెన్ (స్ర్కీన్ పై రాసుకునేందుకు),
1.4గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ కోసం).
గెలాక్సీ నోట్ 800ను ప్రపంచవ్యాప్తంగా 10దేశాల్లో విడుదల చేయగా అందులో భారత్ ఒకటని సామ్‌సంగ్ ఇండియా మొబైల్ ఐటీ విభాగాధిపతి రంజిత్ యాదవ్ తెలిపారు. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన (ఎస్ నోట్, ఇంటర్నెట్ బ్రౌజర్, వీడియో ప్లేయర్, ఈమెయిల్, గ్యాలరీ, పొలారిస్) వంటి అప్లికేషన్‌లను ఏకకాలంలో ఉపయోగించుకునే విధంగా మల్టీ స్ర్కీన్ ఆప్షన్‌ను ఏర్పాటు చేసినట్లు యాదవ్ పేర్కొన్నారు.
ఇవే కాకుండా భారతీయ విద్యార్థులకు దోహదపడేవిధంగా ‘మై ఎడ్యుకేషన్’ అనే అప్లికేషన్‌ను గ్యాడ్జెట్‌లో పొందుపరిచారు. ఈ అప్లికేషన్‌లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి 10,000 వీడియోలు లోడ్ చేసి ఉంటాయి. అంతేకాదు ఈ యాప్ లో 800కు పైగా విద్యాసంబంధిత పాఠ్యపుస్తకాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications








