మార్కెట్లోకి సామ్‌సంగ్ ఖరీదైన ట్యాబ్లెట్!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ఇండోనేషియాలో ఆవిష్కరించిన అతిపెద్ద ట్యాబ్లెట్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. భారత్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ Flipkart ఈ ట్యాబ్‌ను రూ.61,890కి ఆఫర్ చేస్తోంది. ఔత్సాహికులు గెలాక్సీ నోట్ ప్రో 12.2 ను బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. మరోవైపు samsungindiaestore ఈ డివైస్‌కు సంబంధించి ప్రీబుకింగ్‌లను ఆహ్వానిస్తోంది. ధర రూ.65,575.

డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు, 12.2 అంగుళాల WQXGA డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1600పిక్సల్స్), 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ట్యాబ్లెట డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 2560× 1600పిక్సల్స్), డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు.
ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్‌తో లభ్యం కాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్సినోస్ 5 ఆక్టా (1.9గిగాహెట్స్ x 4 + 1.3GHz x 4) ప్రాసెసర్‌ను డివైస్‌లో వినియోగించారు. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని మరో 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. శక్తివంతమైన 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీని ట్యాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు.
కనెక్టువిటీ ఫీచర్లు... ఎల్టీఈ/3జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, ఆల్ షేర్ కాస్ట్, బీటీ4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్ + గ్లోనాస్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








