వచ్చే వారమంటూ పుకార్లు.. రేగుతున్న ఉత్కంఠ?

Posted By: Prashanth

వచ్చే వారమంటూ పుకార్లు.. రేగుతున్న ఉత్కంఠ?

 

టెక్ ప్రపంచంలో ఆ గుస గుస తీవ్ర కలకలం రేపుతుంది.. ప్రత్యర్థులు గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తుంది... అనుయాయులు ఆత్రుతంగా ఎదరుచూస్తున్న ఈ తరణం త్వరలో రానుందన్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. 11.6 అంగుళాల డిస్‌ప్లే పరిమాణంలో అత్యాధునిక కంప్యూటింగ్ సాంకేతికతతో రూపుదిద్దుకున్న శామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్‌ను మార్చి 9 నుంచి 18 వరకు అస్టిన్‌లో నిర్వహించనున్న SXSW ట్రేడ్‌షోలో ఆవిష్కరించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ లాంఛ్‌కు సంబంధించి శామ్‌సంగ్ ఏ విధమైన అధికారిక ప్రకటనా వెలవరించలేదు. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 11.6, హై క్వాలిటీ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇతర ఫీచర్లు ధరకు సంబంధించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot