వాయిదా వెనుక వ్యూహం..?

Posted By:

వాయిదా వెనుక వ్యూహం..?

 

దిగ్గజ బ్రాండ్ శామ్‌సంగ్ నుంచి వెలువడిన తాజా ప్రకటన ఆ బ్రాండ్ అభిమానులను అయోమయానికి లోను చేసేదిగా ఉంది. గెలక్సీ ట్యాబ్ 2 సిరీస్ నుంచి లాంఛ్ కావల్సిన రెండు టాబ్లెట్ కంప్యూటర్ల ఆవిష్కరణ జాప్యం కానుంది. వీటి విడుదలను నిలుపుదల చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది.

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ టాబ్లట్ పీసీలను మరింత బలపేతం చేయ్యాల్సి ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏదేమైనప్టికి ఏప్రిల్ చివరి నాటికి తమ ప్రుడక్ట్‌ను యూకేలో విడుదల చేస్తామని సంబంధిత వర్గాలు ప్రకటించాయి. అనుకున్న దాని ప్రకారం శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 2 (7.0), గెలక్సీ ట్యాబ్ 2 (10.1) స్ర్కీన్ వర్షన్‌లను మార్చిలోనే విడుదల చెయ్యాల్సి ఉంది. ఈ ప్రిక్రియ నత్తనడకన సాగటంతో పలువురు ఉత్కంఠకు లోనవుతున్నారు.

ఈ రెండు పీసీలలో ఏ ఏ అంశాల పై నవీకరణ జరుగుతందనే దాని పై ఖచ్చితమైన సమాచారాన్ని శామ్ సంగ్ వెలువరించలేదు.

లాంఛ్ నాటికి గెలక్సీ ట్యాబ్ 2 (7.0) ఫీచర్లు :

• 3జీ సౌలభ్యత,

• వై -ఫై,

• 7 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే (హై రిసల్యూషన్ 1024-by-600 పిక్సల్),

• బరువు 345 గ్రాములు,

• 1జిగా హెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

• ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలనందించే రేర్, ఫ్రంట్ కెమెరా వ్యవస్ధ,

• ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబి,

• మైక్రో‌ఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత.

గెలక్సీ ట్యాబ్ 2 (10.1) ఫీచర్లు:

• 3జీ సౌలభ్యత,

• వై -ఫై,

• 10 అంగుళాల స్ర్కీన్ డిస్‌ప్లే (హై రిసల్యూషన్ 1280-by-800 పిక్సల్),

• బరువు 588 గ్రాములు,

• 1జిగా హెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

• ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలనందించే రేర్, ఫ్రంట్ కెమెరా వ్యవస్ధ,

• ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబి,

• మైక్రో ఎస్డీ కార్ట్ స్లాట్ ద్వారా మెమరీని పెంచుకునే సౌలభ్యత.

విడుదల విషయంలో అనేక అరమరికలు తలెత్తిన అనంతరం అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో మరి కొద్ది రోజుల్లో మీ ముందు రాబోతున్న గెలక్సీ ట్యాబ్ 2 సిరీస్ టాబ్లెట్ పీసీలు మీ అంచనాలకు మించి ఉండాలిని ఆశిస్తున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot