సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్.. బాలి, ఇండోనేషియో వేదికగా మంగళవారం నిర్వహిస్తోన్న సామ్‌సంగ్ ఫోరమ్ 2014 సరికొత్త ఆవిష్కరణలతో మారుమోగుతోంది. గిజ్‌బాట్ బృందం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేస్తోంది. ఈ వేదిక నుంచే సామ్‌సంగ్ తన లేటెస్ట్ వర్షన్ ట్యాబ్లెట్ డివైస్ ‘గెలాక్సీ ట్యాబ్ 3 నియో' (Galaxy Tab 3 Neo)ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.16,490.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్). వై-ఫై వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు.
డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసారు. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 1జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ డివైస్ మెమెరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లోపించింది. 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో).
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. 3జీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ కైస్, సామ్‌సంగ్ టచ్‌విజ్, సామ్‌సంగ్ హబ్ (ఎంఆర్), చాట్‌ఆన్: మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ వాయిస్, డ్రాప్ బాక్స్, పొలారిస్ ఆఫీస్, ఫ్లిప్‌బోర్డ్.
ఈ డివైస్ ద్వారా గూగుల్ అందిస్తోన్న అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో విక్రయాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డివైస్‌కు సంబంధించిన పలు ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
ధర
ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ట్యాబ్ 3 నియో ధర రూ.16,490

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
డివైస్ పరిమాణం
డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
డిస్‌ప్లే
7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్)

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
కెమెరా
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఫీచర్ లోపించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో@రూ.16,490
బ్యాటరీ
3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో)


Click it and Unblock the Notifications